Breaking News

పారాణి ఆరలేదు.. గోరింట చెరగలేదు

Published on Sat, 08/09/2025 - 07:58

తిమ్మాపూర్‌/చొప్పదండి/గొల్లపల్లి: కాళ్లకు పెట్టిన పారాణి ఆరలేదు. చేతులకు వేసుకున్న గోరింటాకు ఇంకా చెరిగిపోలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయలేదు. వచ్చిన బంధువులు తిరిగి ఇంకా ఇళ్లు చేరనేలేదు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన నవవధువును లారీరూపంలో మృత్యువు కబలించింది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలకేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం..

 జిల్లాలోని చొప్పదండి మండలం రుక్మాపూర్‌ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిల(22)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్‌ గ్రామానికి చెందిన చిరుత రాజుతో ఈనెల 6వ తేదీన వివాహం జరిగింది. శుక్రవారం పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు అఖిల భర్త రాజుతో కలిసి తిమ్మాపూర్‌ మండలకేంద్రంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలకు వచ్చింది. 

పరీక్ష రాసి బైక్‌పై ఇద్దరూ కలిసి తిరిగి వెళ్తున్న క్రమంలో వెనకనుంచి లారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన అఖిల అక్కడికక్కడే చనిపోయింది. రాజుకు స్వల్పగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రీకాంత్‌ గౌడ్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ సురేందర్‌సింగ్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)