బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

Published on Tue, 12/02/2025 - 21:55

సాక్షి, కరీంనగర్ జిల్లా: కరీంనగర్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను తమ్ముడే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. సీపీ గౌస్‌ ఆలం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. అన్నను టిప్పర్‌తో ఢీకొట్టి.. ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.

రూ.కోటి 50 లక్షల అప్పుల్లో చిక్కుకున్న ప్రధాన నిందితుడు మామిడి నరేష్.. తన అప్పులు తీర్చుకోవడానిక అన్న వెంకటేశ్ పేరుపై భారీ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. మొత్తం ఇన్స్యూరెన్స్ విలువ రూ. 4 కోట్ల 14 లక్షలు. అదనంగా యాక్సిస్‌ బ్యాంకులో మరో 20 లక్షల రూపాయల గోల్డ్ లోన్ అన్న పేరిట  తీసుకున్న ప్రధాన నిందితుడు.. పెద్దన్నను చంపి ప్రమాదంగా చూపే పకడ్బందీ ప్లాన్‌ చేశాడు. స్నేహితుడు నముండ్ల రాకేశ్, డ్రైవర్ మునిగాల ప్రదీప్‌తో కలిసి కుట్ర పన్నాడు. ప్లాన్ మాట్లాడుకున్న వీడియోను రాకేశ్.. మొబైల్‌లో రికార్డ్ చేసి భద్రపరిచాడు.

గత నెల (నవంబర్‌ 29, శనివారం) రాత్రి టిప్పర్‌తో పెద్దన్న వెంకటేష్‌ను ఢీకొట్టాడు. టిప్పర్  బ్రేక్‌డౌన్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య తర్వాత ప్రమాదంలా చూపేందుకు కుటుంబాన్ని నరేష్‌ తప్పుదారి పట్టించాడు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన రామడుగు పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకోవడంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య కుట్ర వీడియో ఉన్న మొబైల్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)