బీఆర్‌ఎస్‌లో‘కవిత లేఖ’ కలకలం

Published on Fri, 05/23/2025 - 06:10

సాక్షి, హైదరాబాద్‌: ఎల్కతుర్తిలో గత నెల 27న జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు వచ్చిన స్పందన, తన తండ్రి కేసీఆర్‌ ప్రసంగం తీరుతెన్నులను విశ్లేషిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా చెప్తున్న లేఖ పార్టీలో కలకలం రేపుతోంది. అమెరికాలో తన కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్‌ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లిన కవిత శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. 

కవిత హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాతే లేఖ అంశంపై స్పందించే అవకాశముంది. అయితే కవిత రాసింది లేఖ కాదని, తన అభిప్రాయాలతో రాసిన నోట్‌ మాత్రమేనని ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. రజతోత్సవ సభపై కేసీఆర్‌కు ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు తయారుచేసుకున్న నోట్స్‌ బయటకు ఎలా లీక్‌ అయిందనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. 

లేఖలో పేర్కొన్న అంశాలు 
⇒ ఎల్కతుర్తి సభ పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందరూ మీ (కేసీఆర్‌) ప్రసంగం చివరి వరకు ఆసక్తిగా విన్నారు. ఆపరేషన్‌ కగార్, రేవంత్‌ ప్రభుత్వ వైఫల్యాలు, పహల్గామ్‌ అమరులకు నివాళి, ప్రసంగంలో రేవంత్‌ పేరును ప్రస్తావించకపోవడం అందరికీ నచ్చాయి. 
⇒ తెలంగాణ అంటే బీఆర్‌ఎస్‌ అనే విషయాన్ని బలంగా చెప్తారని ఆశించారు. ప్రసంగంలో మరింత పంచ్‌ ఉండాలని నాయకులు, కార్యకర్తలు కోరుకున్నారు. పోలీసులను హెచ్చరించడంపై మంచి స్పందన వచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం మార్చడంపై మీరు స్పందిస్తారని అనుకున్నారు. 
⇒ వక్ఫ్‌ బిల్లు, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడితే బాగుండేది.  



⇒ బీజేపీపై మీరు రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలకు తావు ఇచ్చినట్లు అయింది. బీజేపీతో ఇబ్బంది పడిన తాను కూడా ఇదే అంశాన్ని కోరుకున్నా. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌పై నమ్మకం కోల్పోయిన వారు బీజేపీ మనకు ప్రత్యామ్నాయమవుతుందని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేయకపోవడంతో బీజేపీకి మనం సాయం చేశామనే కోణాన్ని కాంగ్రెస్‌ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.  
⇒ జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా మిమ్మల్ని కలవడం సాధ్యం కావడం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. దయచేసి అందరికీ చేరువకండి.   

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)