Breaking News

లైంగిక ఆరోపణలు.. కాళేశ్వరం ఎస్‌ఐ భవానీ సేన్‌ డిస్మిస్‌

Published on Wed, 06/19/2024 - 14:18

సాక్షి, భూపాలపల్లి: కాళేశ్వరం ఎస్‌ఐ భవానీ సేన్‌పై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఎస్‌ఐను డిస్మిస్‌ చేస్తూ తెలంగాణ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్‌ఐ భవానీ సేన్ ను సర్వీస్ నుంచి ప్రభుత్వం తొలగించింది. భవానీ సేన్‌ వేధింపులపై మహిళా కానిస్టేబుల్‌.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ భవానీ సేన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. సర్వీస్‌ రివాల్వర్‌తో బెదిరించి రెండు సార్లు లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు తెలిపింది. 

కాగా, ఇతని వ్యవహారశైలిపై ‘సాక్షి’కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం ఇచ్చిన సర్వీస్‌ రివాల్వర్‌ను అడ్డుపెట్టుకుని రాసలీలలు చేయడంలో తనకు తనే సాటి. గతంలో పనిచేసిన మంచిర్యాల జిల్లాలో ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి సస్పెండ్‌ అయిన ఘన చరిత్ర ఆయనది. తన దగ్గర పనిచేసే మహిళా సిబ్బందిని డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో ఇబ్బందికి గురిచేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘నేను అందంగా లేనా... నన్ను వద్దంటావా...? కారణం చెప్పవా.. అనే మాటలు ఆయన దగ్గర పనిచేసే మహిళా సిబ్బంది, ఫిర్యాదుదారులు ఒక్కసారైనా ఎదుర్కోవాల్సిందే. అవసరం లేకున్నా రాత్రి వరకు మహిళా సిబ్బందిని స్టేషన్‌లో ఉంచుకుని హింసపెట్టడం తన దినచర్యలో భాగం

ఆయన నోట తరచూ వినిపించే పదం నేను మంత్రి మనిషిని.. నాకేం కాదు. ఇది చెప్పుకుంటూ పై అధికారులను మొదలుకొని కింది సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతగాని బెదిరింపులు భరించలేక ఆ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఏఎస్సై, ఓ హెడ్‌ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌ బదిలీ చేసుకుని వెళ్లినట్లు సమాచారం. చోటామోటా నాయకులు స్టేషన్‌కు వస్తే చాలు... అందరికి వినిపించేలా ‘బాబన్న బాగుండా.. నాకు ఇంతకుముందే ఫోన్‌ చేసిండు’ అంటూ తనకు తానే డప్పు కొట్టుకోవడం కనిపిస్తుంటుంది.

ఆ జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరుతో పోలీస్‌ అధికారులను, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న రాసలీలల ఘనుడి విషయం ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంతో... తన కామవాంఛలను పనిచేసిన ప్రతీచోట మహిళా సిబ్బందిపై తీర్చుకుంటూ పోతున్నాడు. ఇలాంటి ఖాకీచకులపై పోలీస్‌శాఖ చర్యలు తీసుకోకుంటే మహిళలు ఆ శాఖకు రావాలంటేనే భయపడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో దృష్టి పెడితే ఇలాంటి ఘనుల బాగోతం వెలుగు చూసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)