Breaking News

కాళేశ్వరం ఈఈకి 200 కోట్ల ఆస్తులు.. భారీగా బంగారం, డైమండ్స్..

Published on Thu, 06/12/2025 - 10:22

సాక్షి, హైదరాబాద్‌‌: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.  నూనె శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు అతన్ని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం.. రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కాగా, ఈఈ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా ఆయనకు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేయగా.. స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు, కార్లు సీజ్, విల్లాలు, బయటపడ్డాయి.

శ్రీధర్‌ నివాసం, కార్యాలయం, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. తెల్లాపూర్‌లో విల్లా, షేక్‌పేటలో ప్లాట్‌, కరీంనగర్‌లో 3 ఓపెన్‌ ప్లాట్లు, అమీర్‌పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో 3 ఇండిపెండెంట్‌ హౌస్‌లు, అతనికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో 19 ఓపెన్‌ ప్లాట్‌లు ఉన్నట్టు తేలింది.

రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వలు తనిఖీల్లో బయటపడ్డాయి. శ్రీధర్‌ తన పదవిని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ నిర్ధారించింది. మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. శ్రీధర్‌ ఎస్‌ఆర్‌ఎస్పీ డివిజన్‌-8లో ఈఈగా పని చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్‌ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)