Breaking News

కాళేశ్వరం కమిషన్‌ ఫైనల్‌ రిపోర్ట్‌.. లీగల్‌ ఒపీనియన్‌ వచ్చాకే అసెంబ్లీకి..!

Published on Thu, 07/31/2025 - 18:16

హైదారాబాద్‌:    ప్రభుత్వానికి చేరిన కాళేశ్వరం కమిషన్‌ ఫైనల్‌ రిపోర్ట్‌ను లాకర్‌లో పెట్టారు.  దీనిపై ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చిన సీఎస్‌ రామకృష్ణారావు... ఈ తుది నివేదికను లాకర్‌లో పెట్టారు. ఈ తుది నివేదికపై ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, సీఎస్‌ రామకృష్ణారావులు కీలక అధికారులతో భేటీ అయ్యారు. 

కేబినెట్‌లో చర్చించే ముందు షీల్డ్‌ కవర్‌ ఓపెన్‌ చేయనుంది ప్రభుత్వం. ఈ నివేదికను కేబినెట్‌లో చర్చించిన తర్వాత లీగల్‌ ఒపీనియన్‌కు పంపనుంది ప్రభుత్వం. లీగల్‌ విషయాలపై అడ‍్వకేట్‌ జనరల్‌కి రిఫర్‌ చేయనుంది. దీనిపై లీగల్‌ ఒపీనియన్‌ వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెట్టే యోచనలో ఉంది తెలంగాణ సర్కారు.

కాళేశ్వరం కమిషన్‌ నివేదిక అంశానికి సంబంధించి గురువారం బీఆర్‌కే భవన్‌కి వచ్చిన కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌.. షీల్డ్ కవర్‌లో రెండు డాక్యుమెంట్లను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జకు అందజేశారు. 500 పేజీల చొప్పున.. మొత్తం వెయ్యి పేజీలతో కమిషన్‌ తుది నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 15 నెలలపాటు విచారణ జరిపి తుది నివేదికను రూపొందించింది. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)