Breaking News

ఏఐ వార్తలు @ గిరిజన టీచర్‌

Published on Thu, 02/27/2025 - 04:24

ఆదిలాబాద్‌ టౌన్‌: ఆదివాసీ పేద కుటుంబంలో జన్మించి అభ్యున్నతి వైపు పయనిస్తున్నాడు గిరిజన ఉపాధ్యాయుడు తొడసం కైలాస్‌. అంతరించిపోతున్న గోండి, కొలామి భాషల పరిరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా యాంకర్‌ను సృష్టించి గోండి భాషలో వార్తలు చదివిస్తున్నాడు. 

గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబాడా భాషల్లో వందలాది పాటలు రాసి ఔరా అనిపించాడు. ఆదిలాబాద్‌ జిల్లాలోని మావల మండలం వాఘాపూర్‌ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన కైలాస్‌ సేవల గురించి ఇటీవల మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రస్తావించి ప్రశంసించటం గమనార్హం.

మట్టిలోని మాణిక్యం
కైలాస్‌ 1 నుంచి 10వ తరగతి వరకు వాఘాపూర్‌ సర్కారు బడిలో చదివాడు. ఉట్నూర్‌లోని లాల్‌టేక్డి రెసిడెన్షియల్‌లో ఇంటర్, ఆదిలాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశాడు. 2000 సంవత్సరంలో అన్‌ట్రెయిన్డ్‌ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ కొలువు సాధించాడు. ఈయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు పిల్లలు గంగోత్రి, సృజన్‌రామ్‌ ఉన్నారు. 

గాదిగూడ మండలంలోని డొంగర్‌గావ్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేసి, ప్రస్తుతం ఇంద్రవెల్లి మండలం గౌరపూర్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ (సాంఘిక శాస్త్రం)గా విధులు నిర్వహిస్తున్నాడు. విద్యార్థులకు ప్రొజెక్టర్‌ ద్వారా డిజిటల్‌ పాఠాలు బోధిస్తున్నాడు. కరోనా సమయంలో గిరిజనులను అప్రమత్తం చేసేందుకు గోండి భాషలో కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేశాడు. 

గోండి భాషలోకి మహాభారతం
ఆదివాసీలకు మహాభారత గ్రంథాన్ని అందించాలనే ఉద్దేశంతో తెలుగు లిపి ద్వారా గోండి భాషలోకి ఆ గ్రంథాన్ని కైలాస్‌ అనువదించాడు. ‘సుంగల్‌తూర్పో (ఇలవేల్పు), తొడసం బండు (ఇంటి దేవత), నైతం మారుబాయి (అమ్మమ్మ), తొడసం నేలేంజ్‌ (తమ్ముని కూతురు)’పేరిట ఏఐ యాంకర్‌తో వార్తలు చదివించేవాడు. సంగీతం అంటే ఆయనకు మక్కువ. దీంతో కొలామి భాషలో వందకు పైగా పాటలు రచించి, వాటిని సైతం ఏఐ యాంకర్‌తో పాడించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

గిరిజనులను చైతన్యపర్చాలని..
గిరిజనులను చదువు వైపు మళ్లించడంతోపాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను చేపడుతున్నా. జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సాంకేతికతపై ఉన్న మక్కువతో ఏఐ యాంకర్‌ ద్వారా గోండి, కొలామి ఇతర భాషల్లో వార్తలు చదివించడం, పాటలు పాడించడం చేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నన్ను అభినందించడం సంతోషంగా ఉంది.     – తొడసం కైలాస్, ఉపాధ్యాయుడు

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)