Breaking News

బాలుడిపై లైంగిక దాడి

Published on Mon, 10/13/2025 - 13:14

సాక్షి, హైదరాబాద్‌: బాలసదనంలోని ఓ బాలుడిపై లైంగిక దాడి జరిగింది. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రికి ఆ బాలుడు వెళ్లగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్‌ బాల సదనంలోని ఓ బాలుడిపై కొంత కాలంగా అక్కడే పనిచేస్తున్న గార్డ్‌ స్టాఫ్‌ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఆ బాలుడు అస్వస్థతకు లోనయ్యాడు. 

అనుమతి లేకున్నా, షార్ట్‌ లీవ్‌ మంజూరు చేశారు. దీంతో ఆ బాలుడు ఇంటికి వెళ్లాడు. నీరసంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్‌.. ఆ బాలుడు లైంగిక దాడికి గురైనట్టు నిర్ధారించాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సైదాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలసదనానికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఉద్యోగి (గార్డ్‌ స్టాఫ్‌)ని శనివారం రాత్రి అరెస్టు చేశారు. 

మరికొందరిపైనా దాడి...: ఈ బాలసదనంలో మొత్తం 77 మంది చిన్నారులున్నారు. లైంగిక దాడి విషయంపై పోలీసులు ఆదివారం కూడా ఆరా తీశారు. మరో నలుగురిపైనా లైంగిక దాడి జరిగినట్టు గుర్తించారు. వారిని పోలీసులు ప్రత్యేకంగా విచారించి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్టు సమాచారం. ఈ దాడి వెనుక మరో ఇద్దరు ఉద్యోగుల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది.  

నిత్య వైద్య పరీక్షలేవీ?: వాస్తవానికి విద్యార్థులకు ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఈ మేరకు అక్కడ శాశ్వత ప్రాతిపదికన డాక్టర్‌ను నియమించినా, ఆయన బాలసదనానికి చుట్టపుచూపుగా వస్తుంటాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోచోట ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వహిస్తుండటంతో ఆయన ఇక్కడ విధులకు సకాలంలో హాజరుకారనే ప్రచారం ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించినట్టు సమాచారం.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)