Breaking News

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Published on Tue, 06/23/2026 - 02:31

హైదరాబాద్‌: మైనర్ బాలికలకు రక్షణ దొరకడానికి బీఆర్ఎస్ పోరాడుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. బండి భగీరథ్ పోక్సో కేసులో నాలుగు సార్లు బాలిక అత్యాచారానికి గురైందని అన్నారు. మొదటి నుంచి నిందితుడిని రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

‘‘బాధితురాలి మీదనే అక్రమంగా హనీట్రాప్ కేసు పెట్టించారు. కానీ, బీఆర్ఎస్ బాధితులకు న్యాయం జరగాలని పోరాడింది. మే8 న కేసు నమోదైనప్పటి నుంచి జైలుకు పోకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చూస్తే.. బీఆర్ఎస్ పసిగట్టి ప్రజలు, సోషల్ మీడియా సహాయంతో పోరాడింది. పోరాడిన తర్వాత సెక్షన్ 6 యాడ్ చేశారు. ప్రజలు, మీడియా, బీఆర్ఎస్ పోరాటంతో బండి భగీరథ్ లొంగుబాటు, అరెస్ట్ డ్రామా చేశారు. 

అనంతరం చర్లపల్లి జైలుకు పంపారు. మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో 3 సార్లు బెయిల్ కు అప్లై చేస్తే.. రిజెక్ట్ చేశారు. కానీ ఈ విషయం బాధితురాలికి చెప్పలేదు. బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలం రికార్డు చేశారు. నిందితుడిని కూడా ఎగ్జామిన్ చేశారు. బాధితురాలి తల్లి ఈ నెల 17, 18 తేదీల్లో నాతో మాట్లాడింది. కేసులో ఏం జరుగుతుందో చెప్పడం లేదని వివరించింది.  ఇన్వెస్టిగేషన్ అధికారి బిజీగా ఉంటే, ఎవరో ఒక మహిళా అధికారి వీరికి ఎల్లప్పుడూ వివరాలు చెబుతూ ఉండాలి. 

బెయిల్ కోసం అప్లై చేస్తే తప్పకుండా బాధితులకు చెప్పాలి. బాధితురాలు స్టేట్మెంట్ వివరాలు అడిగితే అధికారులు ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి ఎందుకు బాధితురాలితో మాట్లాడలేదు. బండి భగీరథ్ ని కాపాడాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. పోలీసులు నిందితులు, సహ నిందితులను వెంటనే ఎగ్జామిన్ చేయాలి. నిందితునికి బెయిల్ వచ్చిన విషయం బయటి ప్రపంచానికి ఎందుకు తెలియనివ్వడం లేదు?  అంత రహస్యంగా ఎందుకు చేస్తున్నారు? 

నిందితుని తరపు లాయర్ కోర్టులో ఫైల్ చేసిన పిటిషన్ ప్రకారం..  ఇతను 2023 నుంచి 2026 వరకు మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నాడు. 2023లో పాశవికంగా తోటి విద్యార్థులపై దాడి చేస్తే.. సస్పెండ్ చేశారు. మూడు సంవత్సరాల కోర్సులో ఇప్పుడు పరీక్షలు రాయకపోతే జీవితం ఆగమవుతదని ఇచ్చారు. 

ఇప్పటికీ బెయిల్ ఆర్డర్ ఇవ్వలేదు. బయటి ప్రపంచానికి, కనీసం బాధితులకు కూడా ఇవ్వడం లేదు. బాధితులు భయంతో కోర్టుకు, పోలీసులు వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రిసన్ మ్యానువల్ ప్రకారం... అందరూ జైలులో చదువుకొని, పరీక్షలు రాసుకోవచ్చు. భగీరథ్ బెయిల్ కోసం అప్లై చేస్తే... జైలులో రాయవచ్చు కదా? అమ్మాయికి న్యాయం జరగడం లేదు. హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం’’ అని తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)