Breaking News

ఫలితం కోసం చూడకుండా అంకితభావంతో పనిచేయాలి 

Published on Mon, 08/21/2023 - 03:09

సాక్షి, హైదరాబాద్‌: ‘ఫలితాల కోసం ఎదురుచూడకుండా అంకితభావంతో నీ పని నువ్వు చేసుకుపో.. అని భగవద్గీతలోని శ్లోకాలు చెబుతున్నాయి..ఇది అర్బిట్రేషన్‌లో నిపుణులు ఎలాంటి కీలకపాత్ర పో­షిం­చాలో చెబుతుంది’అని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే అన్నారు. ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐ­ఏ­ఎంసీ) ఆధ్వర్యంలో ‘ఆర్బిట్రేషన్‌లో విలువను పెంపొందించడం–నిపుణుల సూచనలు’అనే అంశం­పై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘కర్మాణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’అనే భగవ­ద్గీత శ్లోకాన్ని ఉటంకించారు.నిష్పక్షపాతానికి కట్టుబడి న్యాయమైన తీర్మానాలకు వేదికను ఏర్పా­టు చేయడంతో నిపుణులకు ఈ సూత్రం ప్రతిధ్వనిస్తుంద­ని చెప్పారు. ఐఏఎంసీ రిజిస్ట్రార్ ప్రారంభోపన్యా­సం చేశారు. భారత్‌ను అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంగా మార్చడంలో న్యాయవ్యవస్థ, ప్రభుత్వ పాత్ర కీలకమని అన్నారు.

కార్యక్రమంలో జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి, జస్టిస్‌ శ్రీసుధ, జస్టిస్‌ నంద, జస్టిస్‌ కాజ శరత్, జస్టిస్‌ పుల్లా కార్తీక్, సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ కమర్షియల్‌ కోర్ట్‌ అంతర్జాతీయ మధ్యవర్తి, అంతర్జాతీయ న్యాయమూర్తి ప్రొఫెసర్‌ డగ్లస్‌ జోన్స్, లండన్, టొరంటో, సిడ్నీ­లోని లా ఛాంబర్స్‌తో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేటర్‌ ప్రొ­ఫెసర్‌ జానెట్‌ వాకర్, ఎఫ్‌టీఐ కన్సల్టింగ్  సీని­యర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లీ బేకర్, అర్బిట్రేటర్‌ భాగస్వామి విన్సెంట్‌ రోవాన్, ఎఫ్‌టీఐ కన్సల్టింగ్‌లో సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ బలిసాగర్‌ పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)