Breaking News

కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి

Published on Sun, 08/27/2023 - 01:54

కుషాయిగూడ: న్యాయం కోసం కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే అన్నారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలోని ఆఫెల్‌ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్‌ డ్రాస్టిక్‌ కోర్టుతో పాటు ఇతర కోర్టుల సముదాయాన్ని శనివారం ఆయన మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కోర్టు అడ్మిమినిస్టేటివ్‌ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి. వినోద్‌కుమార్‌తో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్‌ అరాధే మాట్లాడుతూ, సత్వర న్యాయం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటన్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాలను ఆశ్రయించే కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. న్యాయవ్యవస్థ పనితీరు ప్రభావవంతంగా, సమర్థవంతంగా ఉన్నప్పుడే న్యాయస్థానాలపై విశ్వాసం పెరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోర్టులో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని చీఫ్‌ జస్టిస్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెషన్స్‌ జడ్జి బి.ఆర్‌. మధుసూదన్‌రావు, జిల్లా కలెక్టర్‌ డి.అమోయ్‌కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, రాచకొండ సీపీ డి.ఎస్‌. చౌహాన్, రిజిస్ట్రార్‌ జనరల్‌ తిరుమలదేవి, మెట్రో­పాలిటన్‌ సెషన్స్‌ జడ్జి రఘునాథ్‌రెడ్డి, మేడ్చ­ల్‌– మల్కాజిగిరి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె. రామచంద్రారెడ్డి, సెక్రటరీ ఎం.రాజుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)