Breaking News

29 కోర్టు హాళ్లలో లైవ్‌ ప్రసార సేవలు

Published on Mon, 08/21/2023 - 03:22

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టులో కేసుల విచారణకు సంబంధించి ఆన్‌లైన్‌ లైవ్‌ ప్రసారాలను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రారంభించనున్నారు. ఉదయం 10.15 గంటలకు హైకోర్టులోని 29 హాళ్లలో విచారణల లైవ్‌ ప్రసార సేవలను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి లైవ్‌ ప్రసా­రాలు ప్రారంభం అవుతాయి.

ఇప్పటికే మొదటి కోర్టు హాల్‌లో లైవ్‌ ప్రసార సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొన్ని నెల­లుగా ఈ సేవలు న్యాయవాదులకు, ప్రజలకు అందుబాటులో ఉన్నా­యి. ఇకపై మిగతా కోర్టుల్లో జరిగే విచారణలను కూడా వీక్షించే వీలు కలగనుంది. దీనితో న్యాయవాదులకు కూడా ఆన్‌లైన్‌ ద్వారా వాదనలు వినిపించే అవకాశం లభిస్తుంది. భవిష్యత్‌లో న్యాయవాదులే కాకుండా వాదప్రతివాదుల నుంచి న్యాయమూర్తులు ఏదై­నా సమాచారం తెలుసుకోవాలంటే ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో వివరాలు తెలుసుకోవచ్చు.

అన్ని కోర్టులను ఆన్‌లైన్‌ లైవ్‌ పరిధిలోకి తీసుకొచ్చి న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువచేస్తామని సుప్రీంకోర్టు పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ లైవ్‌ ప్రసారాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. లైవ్‌ ప్రసారాలతో పెండింగ్‌ కేసులు తగ్గే అవకాశం ఉందని, కేసులు సత్వరమే పరిష్కారమవుతా­యని కోర్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన న్యా­య­మూర్తి ఆదేశాల మేరకు లైవ్‌ ప్రసారాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)