పరుగులు తీస్తున్న కృష్ణమ్మ

Published on Sat, 08/01/2026 - 03:02

ధరూరు/అచ్చంపేట: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం రాత్రి 9 గంటల వరకు ప్రాజెక్టుకు 1.04 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 1.22 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. కృష్ణానది వరద ప్రవాహాన్ని బట్టి ఉదయం నుంచి క్రమక్రమంగా క్రస్టు గేట్ల సంఖ్యను పెంచుతూ నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు 24 క్రస్టు గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా 95, 592 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా మరో 35,502 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.01 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.  

⇒ శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ప్రాజెక్టుకు జూరాల నుంచి స్పిల్‌వే, విద్యుదుత్పత్తి ద్వారా 1,31,094 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 834.40 అడుగులతో 54 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)