Breaking News

గాంధీలో జూడాల విధుల బహిష్కరణ

Published on Thu, 08/15/2024 - 04:40

గాంధీ ఆస్పత్రి: కోల్‌కతాలో విధి నిర్వహణలో ఉన్న వైద్యవిద్యార్థినిపై లైంగికదాడి, హత్యలకు నిరసనగా సికింద్రాబాద్‌ గాం«దీ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యులు నిరసన చేపట్టారు. బుధవారం అవుట్‌పేòÙంట్‌ విభాగ విధులను బహిష్కరించి, ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. 

దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులపై జరుగుతున్న దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జూడాల సంఘం గాంధీ యూనిట్‌ అధ్యక్షుడు వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, వైద్య విద్యార్థుల ప్రధానమైన 9 డి మాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. 

ఇవీ డిమాండ్లు 
రెసిడెంట్, మహిళ, పురుష వైద్యులకు వేర్వేరు గా హైజెనిక్‌ డ్యూటీరూమ్‌లను ఏర్పాటు చే యాలని, డాక్టర్స్‌ గ్రీవెన్స్‌ రెడ్రెసెల్‌ కమిటీ ఏ ర్పాటు, వైద్యులు, వైద్యవిద్యార్థులు విధులు నిర్వహించే ప్రాంతాల్లో 24 గంటలూ సీసీ కెమె రాల పర్యవేక్షణ ఉండాలని, ఆస్పత్రి మెయిన్‌ ఎంట్రన్స్, అత్యవసర విభాగం, ఇతర ప్రదేశా ల్లో సెక్యూరిటీ గార్డులను నియమించి, పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, కళాశాల మైదానంలో అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలని, ఆస్పత్రి ప్రాంగణంలోని జయశంకర్‌ విగ్రహం నుంచి బాయ్స్‌ హస్టల్, ఇతర చీకటి ప్రదేశాల్లో వీధిదీపాలను ఏర్పాటు చేయాలని, ఆస్పత్రి ప్రాంగణంతోపాటు హాస్టల్స్‌ పరిసర ప్రాంతాల్లో వీధికుక్కలను నిరోధించాలని, పీజీ హాస్టల్‌కు సింగిల్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టపర్చాలని కోరుతూ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీ పా లనాధికారులకు వి నతిపత్రం సమర్పించారు. 

జూడాల ఓపీ విధుల బహిష్కరణ ఫలితంగా వైద్యసేవల్లో జాప్యంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా, అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో బుధవారం ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. గురు వారం కూడా విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఐజాక్‌ న్యూటన్‌ తెలిపారు. 

వైద్యులకు అండగా మేమున్నాం: మంత్రి సీతక్క 
కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం అత్యంత హేయమైన చర్య అని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని పరామర్శించిన అనంతరం అక్కడ ఆందోళన చేస్తున్న జూడాల వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. 

ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ వైద్యులకు తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి, మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, హత్యాయత్నాలు జరగకుండా కఠినమైన చట్టాలను తేవడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామని హామీనిచ్చారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)