Breaking News

చికిత్స పొందుతూ జూనియర్‌ డాక్టర్‌ మృతి

Published on Mon, 01/05/2026 - 08:06

సిద్దిపేటఅర్బన్‌: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జూనియర్‌ డాక్టర్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బి.లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో హౌస్‌ సర్జన్‌ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తోంది. శుక్రవారం ఉదయం లేబర్‌ రూంలో డ్యూటీలో ఉండగా అనారోగ్యంగా ఉండటంతో క్యాజువల్‌ డిపార్ట్‌మెంట్‌లో చికిత్స తీసుకొని కాలేజీ హాస్టల్‌కు వెళ్లారు. 

శనివారం ఉదయం ప్రభుత్వ కళాశాల హాస్టల్‌లో గడ్డి మందును ఇంజెక్ట్‌ చేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన తోటి జూనియర్‌ డాక్టర్లు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఇంటర్న్‌షిప్‌ డ్యూటీలు, నీట్‌ పీజీ ప్రిపరేషన్‌ ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్టు మెడికల్‌ కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. జూనియర్‌ డాక్టర్‌ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో ఆత్మహత్యకు గల కారణాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు. 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)