Breaking News

Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌!

Published on Thu, 12/28/2023 - 07:41

హైదరాబాద్: ఇక తెల్లవార్లూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం లా అండ్‌ ఆర్డర్, ట్రాఫిక్‌ పోలీసులు సమన్వయంగా రెండు షిఫ్ట్‌లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వేర్వేరు చోట్ల వాహనదారులకు శ్వాస పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించారు. వెస్ట్‌జోన్‌ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, పంజగుట్ట, బోరబండ, ఎస్‌ఆర్‌నగర్, మాసబ్‌ట్యాంక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు ఎనిమిది చోట్ల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌పరిధిలో డైమండ్‌ హౌజ్, ఫిలింనగర్‌ విజేత సూపర్‌మార్కెట్‌ వద్ద నిర్వహించిన డ్రంక్‌ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 24 మంది మందుబాబులు పట్టుబడ్డారు. ఎస్‌ఆర్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఎస్‌ఆర్‌నగర్‌ ఐసీఐసీఐ వద్ద రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు, జూబ్లీహిల్స్‌ చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 26 మంది పట్టుబడ్డారు.

బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్టడీ సర్కిల్, గ్రీన్‌ బావర్చి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 13 మంది పట్టుబడ్డారు. పంజగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు రాత్రి 10 నుంచి ఒంటిగంట వరకు గ్రీన్‌ల్యాండ్స్‌ వద్ద, బంజారాహిల్స్‌ పార్క్‌ హయత్‌ వద్ద రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)