Breaking News

‘సీఎం మా గల్లీలోనే ఉంటాడు..నీ అంతు చూస్తా’

Published on Sat, 07/05/2025 - 07:37

బంజారాహిల్స్‌: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మా గల్లీలోనే ఉంటాడు..మీ అంతుచూస్తా..రివాల్వర్‌ తెచ్చి కాల్చి పడేస్తా..’ అంటూ ఫోన్‌లో బెదిరించడమే కాకుండా ముఖ్యమంత్రి ఇంటి నుంచి మాట్లాడుతున్నానంటూ ఫోన్‌ చేసి హెచ్చరించిన ఘటనలో ఓ వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి  వెళితే..జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ (జూబ్లీహిల్స్‌ క్లబ్‌)లో సభ్యుడిగా ఉన్న జ్యోతిప్రసాద్‌ కొసరాజును ప్రవర్తన సరిగాలేని కారణంగా గత మార్చి 12వ తేదీన క్లబ్‌ సభ్యత్వం నుంచి తొలగించారు. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లగా ప్రస్తుతం విచారణ దశలో పెండింగ్‌లో ఉంది.

జూన్‌ 23వ తేదీన సాయంత్రం జ్యోతిప్రసాద్‌ జూబ్లీహిల్స్‌ క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ జగదీశ్వర్‌రెడ్డికి ఫోన్‌ చేసి తాను క్లబ్‌కు వస్తున్నానని, తప్పనిసరిగా లోపలికి అనుమతించాలని బెదిరించాడు. అయితే క్లబ్‌ నిబంధనల ప్రకారం సస్పెన్షన్‌కు గురైన సభ్యుడిని లోనికి అనుమతించడం కుదరదని చెప్పాడు. దీంతో కొద్దిసేపటి తర్వాత జ్యోతిప్రసాద్‌ క్లబ్‌ వద్దకు వచ్చి సెక్యూరిటీగార్డ్‌లను బెదిరిస్తూ..కేకలు వేస్తూ జీఎం జగదీశ్వర్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించాడు. అంతుచూస్తానంటూ బెదిరించాడు. రివాల్వర్‌తో కాల్చిపడేస్తానంటూ హెచ్చరించాడు. తాను సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ఉండే గల్లీలోనే ఉంటానని మరింతగా బెదరగొట్టాడు.

అంతేకాకుండా అదేరోజు సాయంత్రం 6.54 గంటల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి నుంచి ఫోన్‌ చేస్తున్నామని, జ్యోతిప్రసాద్‌కు క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ఫోన్‌ చేశారు. తరచూ సీఎం ఇంటి నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ జీఎంకు కాల్స్‌ వచ్చాయి. ఇవన్నీ జీఎం కాల్‌ రికార్డ్‌ చేశారు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత స్వయంగా జ్యోతిప్రసాద్‌ ఫోన్‌ చేసి తనను క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని, సీఎం ఇంటి నుంచి ఫోన్‌ వచ్చింది కదా? అంటూ చెప్పాడు. 

అంతకుముందు చేసిన ఫోన్‌ కాల్స్‌ వాయిస్‌తో పాటు జ్యోతిప్రసాద్‌ వాయిస్‌ కూడా ఒక్కటే కావడంతో సీఎం ఇంటిని వాడుకుని దురుద్దేశపూర్వకంగా తమను బెదిరించిన వ్యవహారంలో నిందితుడిపై కేసు నమోదు చేయాల్సిందిగా జీఎం ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు క్లబ్‌ మాజీ సభ్యుడు జ్యోతిప్రసాద్‌ కొసరాజుపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 351 (2) కింద కేçసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?