Breaking News

జేపీఎస్‌ల సమ్మె విరమణ

Published on Sun, 05/14/2023 - 04:16

సాక్షి, హైదరాబాద్‌/తొర్రూరు: జూనియర్‌/ ఔట్‌సోర్సింగ్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌/ఓపీఎస్‌) నిరవధిక సమ్మెను విరమించారు. తమ డిమాండ్ల సాధనకు 16 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు శనివారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జేపీఎస్‌లను రెగ్యులరైజ్‌ చేస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆ ధీమాతోనే సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె శ్రీకాంత్‌గౌడ్, ఇతర జిల్లాల నాయకులతో కలిసి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో వెల్లడించారు.

అంతకుముందు వరంగల్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును తెలంగాణ పంచాయత్‌ సెక్రటరీస్‌ ఫెడరేషన్‌ (టీపీఎస్‌ఎఫ్‌) అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్‌గౌడ్‌ తదితరులు కలిశారు. ఈ క్రమంలో తొలుత సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని వారికి మంత్రి సూచించినట్టు సమాచారం. ఆది లేదా సోమవారాల్లో టీపీఎస్‌ఎఫ్‌ ప్రతినిధులతో ఆయా అంశాలపై చర్చిస్తామని మంత్రి హామీనిచ్చిన మీదట సోమవారం నుంచి విధుల్లో చేరనున్నట్టు సంఘం ప్రకటించింది.  

– జేపీఎస్‌ల వ్యవస్థ సృష్టికర్త కేసీఆరే 
కాగా, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్‌ చేయాలనే డిమాండ్‌తో 16 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక, శాంతియుత సమ్మె నిర్వహించామని, జేపీఎస్‌ల వ్యవస్థను సృష్టించిందే సీఎం కేసీఆర్‌ అని సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్‌ అన్నారు. జేపీఎస్‌ల వల్లే తెలంగాణకు కేంద్రం నుంచి 73 అవార్డులు వచ్చాయని, మున్ముందు సైతం అదే రీతిన పనిచేసి మంచి ఫలితాలు రాబడుతామని తెలిపారు. ఈనెల 15వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా విధుల్లో కొనసాగుతామని స్పష్టం చేశారు. సమ్మెకు సహకరించిన ప్రతి ఒక్క జూనియర్‌ పంచాయతీ కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపారు. 

ప్రభుత్వ కఠిన వైఖరి ప్రభావంతోనే విరమణ? 
ప్రభుత్వం కఠినచర్యలకు దిగనున్నట్టు చేసిన ప్రకటన సమ్మె విరమణను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. శనివారంలోగా విధుల్లో చేరకుండా గైర్హాజరైన జేపీఎస్, ఓపీఎస్‌ల తొలగింపుతో పాటు వారి స్థానాల్లో తాత్కాలిక పద్ధతుల్లో నియామకాలు చేపట్టాలని సీఎస్‌ ఎ.శాంతికుమారి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి దాకా సమ్మె కొనసాగించాలా వద్దా, విరమిస్తే పరిస్థితి ఏమిటి, కొనసాగిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే దానిపై టీపీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర,జిల్లా కమిటీల్లో తీవ్రస్థాయిలో చర్చ సాగింది.

సమ్మెలో ఉన్న జేపీఎస్‌లలోనూ పునరాలోచన మొదలైంది. దీనికి తగ్గట్టే శనివారం సాయంత్రానికి పలుజిల్లాల్లో పెద్దసంఖ్యలోనే జేపీఎస్‌లు విధుల్లో చేరినట్టు పీఆర్‌ కమిషనరేట్‌కు నివేదికలు అందాయి. ఇది సమ్మె విరమణ దిశగా ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం కూడా సమ్మె చేసిన జేపీఎస్‌ల పట్ల కొంత చూసీచూడనట్టు వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం. జేపీఎస్‌ల సమ్మె విరమణ నేపథ్యంలో.. వారి స్థానంలో గతంలో జేపీఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి నియామకం, గ్రామాల్లో స్థానికంగా డిగ్రీ పాసై, కంప్యూటర్‌ పరిజ్ఞానమున్న వారిని నియమించే ప్రక్రియను కూడా నిలిపేసినట్టు తెలుస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)