Breaking News

Hyderabad: జర్నీ ఆఫ్‌ రిథమ్స్‌! ఈ నెల 31న ప్రత్యేక నాట్యప్రదర్శన..

Published on Mon, 08/26/2024 - 09:01

సాక్షి, సిటీబ్యూరో: ‘అది ఒక రైల్వేస్టేషన్‌... పదహారు మంది నాట్యకారిణులు అందరూ ఒకే తరహా దుస్తులు, లగేజ్‌ ట్రాలీలతో ప్లాట్‌ఫాంపై సిద్ధంగా ఉన్నారు. రైలు ఎప్పుడు వస్తుందా.. అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో రైలు ఆలస్యంగా వస్తుందని తెలవడంతో తమ పర్యటనలో భాగంగా ఏయే నగరాలను సందర్శించాలో చర్చించుకుంటున్నారు. ఆయా నగరాల్లో ప్రసిద్ధి చెందిన సంగీత రీతుల్లో భరతనాట్య ప్రదర్శన ఇవ్వాలని నిర్ణయించుకున్నారు..’ ఇంతకీ ఇది ఏ రైల్వేస్టేషన్‌లో జరిగిందనేకదా.. మీ అనుమానం!

ఇది నిజంగా  జరగలేదు కానీ.. ఇలాంటి థీమ్‌తో ఓ నాట్యప్రదర్శన ఈ నెల 31న సాయంత్రం 6.30 గంటలకు నగరంలోని గచ్చిబౌలి గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో జరగనుంది. భరతనాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని దేశంలోని ముఖ్యమైన 16 సంగీత రీతులను ప్రయోగాత్మకంగా ప్రదర్శించనున్నారు. శివాన్‌‡్ష మ్యూజిక్‌ అకాడమీ, తత్వ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దాదాపు 1.45 గంటలపాటు ఈ నాట్య ప్రదర్శన నాన్‌స్టాప్‌గా సాగనుంది. ఈ ప్రయోగం కోసం 6 నెలలపాటు శ్రమించినట్లు శివాన్‌‡్ష అకాడమీ నిర్వాహకురాలు, భరతనాట్య కళాకారిణి మైత్రీరావు చెప్పారు. ‘జర్నీ ఆఫ్‌ రిథమ్స్‌’ పేరిట సాగే ఈ నాట్య ప్రదర్శనకు ప్రముఖ రంగస్థల నటి, కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షురాలు పద్మశ్రీ మంజమ్మ జోగతి హాజరుకానున్నారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)