Breaking News

మనం నమ్మిందే రాయాలి!

Published on Sun, 01/25/2026 - 04:01

ధన్యా రాజేంద్రన్‌ సొంతూరు కేరళ రాష్ట్రం, పాలక్కాడ్‌. ఢిల్లీ నుంచి జర్నలిస్టు ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. వార్తా పత్రికలు, టీవీ చానెళ్లలో పని చేసిన తర్వాత సొంతంగా న్యూస్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించి నిర్వహిస్తున్నారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ విషయంలో సమగ్ర దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేటివ్‌ స్టోరీస్‌ అందించారు. ఓటర్ల నమోదులో ఉద్దేశపూర్వకంగా జరిగిన మోసాన్ని ద న్యూస్‌ మినిట్‌ వెబ్‌సైట్‌ ద్వారా బయటపెట్టారు. ‘అవుట్‌ స్టాండింగ్‌ ఉమన్‌ మీడియా పర్సన్‌’చమేలి దేవి జైన్‌ అవార్డు (2022) అందుకున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌ నగరానికి వచ్చారు జర్నలిస్ట్‌ ధన్యా రాజేంద్రన్‌. ది న్యూస్‌ మినిట్‌ న్యూస్‌ (టీఎన్‌ఎమ్‌) వెబ్‌సైట్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఆమె. సమాచారాన్ని నిజాయితీగా అందించాలంటే పత్రికా స్వేచ్ఛతోపాటు జర్నలిజంలో జవాబుదారీతనం కూడా ఉండాలంటూ అనేక విషయాల పట్ల తన అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు. ఆమె మాటల్లోనే... 

‘నేను నమ్మింది నమ్మినట్లు చెప్పడం కోసమే సొంత మీడియా సంస్థను ప్రారంభించాను. టీవీల్లో సమాజానికి అవసరమైన వార్తా కథనాలకంటే రేటింగ్‌ల కోసం ప్రసారాలే ఎక్కువగా కనిపించాయి. మహిళల కోసం, అణగారిన వర్గాల కోసం కథనాలు రాసే అవకాశం కలగలేదు. సొంత సంస్థను స్థాపించి నేను రాయాలనుకున్న కథనాలు రాయడం మొదలు పెట్టాను. నాతోపాటు ఇద్దరు మహిళా జర్నలిస్టులే మా ఎడిటోరియ ల్‌ టీమ్‌. ఎంతకాలం నడిపించగలనో తెలియని అయో మయ పరిస్థితుల్లోనే ధైర్యంగా ముందడుగు వేశాను. ఇప్పుడు నా వెబ్‌సైట్‌ మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకోగలిగింది.  

ఏం రాస్తున్నామో స్పష్టత ఉండాలి 
కెరీర్‌ విషయంలో మా తరం కంటే ఇప్పుడు కొత్త తరం జర్నలిస్టుల ముందు పెద్ద అయోమయం నెలకొని ఉంది. సమా జం అనేక కోణాల్లో విభజితమై, దేనికదిగా కేంద్రీకృతమై ఉంది. ఈ స్థితిలో మనం ఏం రాస్తున్నామనే విషయంలో స్పష్టంగా ఉండాలి. ఒక విషయం, ఒక వ్యక్తి గురించి రాసే ముందు మనకు నమ్మకం కలగాలి. పేద, దళిత, ఆదివాసీల సమస్యలు రాయడానికి ముందు వాటిని విశ్వసించాలి. మన కలం గొంతు పెగల్చలేని నిస్స హాయులకు గొంతుక కావాలి. వారి గళాన్ని మన కలంతో సమాజానికి వినిపించాలి. 

మహిళలకు నిత్యం సమస్యలే!: ఆడవాళ్లకు సవాళ్లు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలవుతున్నాయి. చదువుకోవడం, ఉద్యోగం, పెళ్లి, రోడ్డు మీద నడవడం నుంచి బస్సులో ప్రయాణించడం వరకు ప్రతిదీ ఒక సవాలే. మనదేశంలో మహిళ ఇంకా ఈ సమస్యలన్నింటినీ నిత్యం ఎదుర్కోవాల్సిన స్థితిలోనే ఉంది. 

కంపెనీ సీఈవోలు, మీడియా సంస్థలో ఎడిటర్‌గా మహిళలు చాలా తక్కు వ, డిజిటల్‌ యుగం కావడంతో మహిళలు సొంత మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకుని ఎడిటర్‌లు అయిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. గడచిన నాలుగైదేళ్లుగా మన దేశంలో మహిళలను వెనక్కు నెట్టివేయడం స్పష్టంగా తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)