Breaking News

బీఫ్‌ దుకాణాల వివాదం.. జోగిపేటలో ఉద్రిక్తత

Published on Sat, 07/11/2026 - 13:30

సంగారెడ్డి జిల్లా: జోగిపేట పట్టణంలో బీఫ్, మటన్ దుకాణాల ఏర్పాటు వ్యవహారం రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. అందోల్ ప్రాంతానికి చెందిన కటికే ముస్లింలు, జోగిపేటకు చెందిన ముస్లింల మధ్య దుకాణాల ఏర్పాటు, వ్యాపార ఆధిపత్యం అంశంపై కొద్ది రోజులుగా విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

శనివారం ఈ వివాదం మరోసారి చెలరేగింది. తొలుత ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, కొద్దిసేపటికే అది హింసాత్మకంగా మారింది. పరస్పరం కత్తులు, కర్రలతో దాడులు చేసుకోవడంతో జోగిపేటకు చెందిన పలువురు ముస్లిం యువకులు, వ్యాపారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఘటన అక్కడితో ఆగలేదు. ఘర్షణలో గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, కక్ష ముదిరిన అందోల్ కటికే ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఆసుపత్రి ప్రహరీలోకి కూడా చొరబడ్డారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులపై, వారికి అండగా ఉన్నవారిపై రెండోసారి విరుచుకుపడి దాడికి తెగబడ్డారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణం ఒక్కసారిగా రణరంగంగా మారింది, రోగులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు భారీ బలగాలతో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలను చెదరగొట్టి, ఘర్షణ మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు. అనంతరం పట్టణంలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

 

 

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)