Breaking News

మార్చి 3 నుంచి ఎంసెట్‌ దరఖాస్తులు

Published on Sat, 02/25/2023 - 00:54

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, అగ్రికల్చ ర్, ఫార్మా, నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి మే నెలలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ను హైదరా­బాద్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్‌) శుక్ర­వా­రం విడుదల చేసింది. వర్సిటీలో జరిగిన విలేకరుల సమావేశంలో వీసీ కట్టా నర్సింహారెడ్డి ఎంసెట్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఆన్‌లైన్‌ విధానంలో ఎంసెట్‌ దరఖాస్తులను వచ్చే నెల 3 నుంచి స్వీకరిస్తామని, ఏప్రిల్‌ 10­లోగా అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం తెలంగాణలో 16, ఆంధ్రప్రదేశ్‌లో 5 జోన్లు (కర్నూలు విజయ­వాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు) ఏ­ర్పా­టు చేశామన్నారు. ఎంసెట్‌ ప్రక్రియ పూ­ర్తయ్యేలోగానే అనుబంధ కాలేజీలకు అఫ్లియేషన్‌ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.  

ఈసారి నర్సింగ్‌ కూడా.. 
నర్సింగ్‌ కోర్సుల సీట్లను కూడా ఈసారి ఎంసెట్‌ ద్వారానే భర్తీ చేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు వర్సి­టీ నుంచి  అనుమతి వచ్చిందన్నారు. ఎంసెట్‌కు ఇంటర్‌లో (జనరల్‌ 45 శాతం, రిజర్వేషన్‌ కేటగిరీకి 40 శాతం) కనీస మార్కులు సాధించాలనే నిబంధన అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎంసెట్‌లో ఇంటర్‌కు వెయిటేజీ తొలగించినట్టు ప్రకటించారు.

వెయిటేజీ విధానం కష్టసాధ్యమవ్వడం, జాతీయ పరీక్షల్లోనూ దీన్ని అనుసరించకపోవడంతో తీసివేశామన్నారు. ఫస్టియర్‌ ఇంటర్‌ నుంచి 70 శాతం, సెకండి యర్‌ నుంచి వంద శాతం సిలబస్‌ ఉంటుందన్నా­రు. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డా.శ్రీనివాస్, ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ డీన్‌కుమార్‌ పలువురు అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం  https://eamcet. tsche. ac.in వెబ్‌సైట్‌కు లాగిన్‌ అవ్వాలని ఎంసెట్‌ కన్వీనర్‌ డీన్‌కుమార్‌ తెలిపారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)