Breaking News

పార్టీలో కొనసాగాలా?.. జీవన్‌రెడ్డి సంచలన కామెంట్స్

Published on Mon, 02/16/2026 - 18:09

సాక్షి జగిత్యాల:  కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తన పార్టీపై అసహానం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్‌పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్‌ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి  ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్‌పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు..?

కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి ఛైర్‌పర్సన్ పదవి ఇవ్వాలని మొదటి నుంచీ తాను మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యే నాయకత్వంలోనే పని చేస్తే ఇంకా తాను కాంగ్రెస్‌లో కొనసాగాలా అని ప్రశ్నించారు. జెండా మోసిన కార్యకర్తల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలన్నారు. అభివృద్ధి పేరుతో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఎందుకని ఎమ్మెల్యేను సంజయ్‌ను  ప్రశ్నించారు.

కాంగ్రెస్‌లో అన్యాయం జరిగిన వారికే తాను మద్దతు ఇచ్చానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంత కాలం తమ వర్గంపై  ఈ వేధింపులు కొనసాగుతాయని ఆరోపించారు.ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కొనసాగాలా, వద్దా అన్న సందిగ్ధ పరిస్థితి తనకు  నెలకొందని జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా ఛైర్‌పర్సన్‌ను ఎన్నుకోవాలంటే కనీసం 25 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో  కాంగ్రెస్ 23 చోట్ల, స్వతంత్రులు 15 చోట్ల గెలుపొందారు. బీజేపీకి, ఆరు, బీఆర్ఎస్ నాలుగు, ఎంఐఎం రెండు స్థానాలు గెలుచుకున్నాయికాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం నుంచి 33 మంది పోటీ చేయగా 14మంది, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం నుంచి 17మంది పోటీ చేయగా తొమ్మిది మంది విజయం సాధించారు.

స్వతంత్రుల్లో తొమ్మిది మంది జీవన్ రెడ్డి వర్గం కాగా.. నలుగురు ఎమ్మెల్యే వర్గీయులు, ముగ్గురు బీజేపీ రెబల్స్ ఉన్నారు. ఈ క్రమంలో చైర్మన్ పీఠం కోసం జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ పోటీ పడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా సంజయ్ వర్గానికి చైర్‌పర్సన్ పదవి అప్పగించేందుకు నిర్ణయించారు. దీంతో జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)