Breaking News

నేనేం పాపం చేసిన?

Published on Wed, 02/04/2026 - 04:26

జగిత్యాల: ‘నేనేం పాపం చేసిన.. తినే ముందు పల్లెం ఎత్తుకెళ్లారు.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల కడుపు నింపారు. రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని బలపర్చడమే నేను చేసిన తప్పా. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను వదిలి వలసవాదులకు పెద్దపీట వేశారు.. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించారు? నాలుగు దశాబ్దాల పాటు క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నా’అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

జగిత్యా­ల, రాయికల్‌ మున్సిపాలిటీలకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు పెద్దపీట వేస్తూ అధిష్టానం బీఫామ్‌లు కట్టబెట్టడంతో జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మున్సి­పల్‌ ఎన్నికల్లో ప్రజలే న్యా­య నిర్ణేతలు. జాబితాను కార్యకర్తల అభిప్రా­యం మేరకు సర్వే చేపట్టి ఇచ్చాం. అయినా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను కూర్చోబెట్టుకొని జాబితాను రూ­పొం­దించి నిజమైన కార్యకర్తలకు టికెట్లు రాకుండా చేశారు. 

పదేళ్లపాటు బీఆర్‌ఎస్‌ పాలనకు ఎదురీదిన.. ప్రవాహానికి అనుగుణంగా ఉన్నప్పుడు నన్ను తోసేశారు. జాబితాను రూ­పొం­దించినా పరిశీలించకుండానే జెండా మోసిన వారిని పక్కనపెట్టారు. జీవితంలో కాంగ్రెస్‌ జెండా పట్టనోనికి బీఫామ్‌లు కట్టబెట్టారు. నేను చేసిన తప్పేంటి? నిబద్ధత గల నాయకుడిగా కేసీఆర్‌పైనా పోటీచేసిన. గాం«దీభవన్‌లో ఇంటర్నల్‌ మీటింగ్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వచ్చారని మాట్లాడిన. అందుకు కోపం ఉంటే నాపై చర్యలు తీసుకోవాలి. 

కార్యకర్తల­పై ఎందుకు ? ఓ ఎమ్మెల్సీ మాట్లాడుతూ పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు.. ఎవరు అతిక్రమిస్తున్నారో చెప్పాలి’అని అన్నారు. ఇది పార్టీని న­మ్ముకున్న కార్యకర్తలకు, వలసవాదులకు జరుగు­తున్న పోటీ అని, తాను జెండా మోసిన వారికే మద్దతిస్తానని తేల్చి చెప్పారు. ప్రజలే న్యాయనిర్ణేతలని వ్యాఖ్యానించారు. ఎవరు కాంగ్రెస్, ఎవరు కాదు అన్నది ప్రజలందరికీ తెలుసన్నారు. జెండా మోసిన వారి కోసం ప్రజల్లోకి వెళ్తానని స్పష్టం చేశారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)