Breaking News

అందుకే గాంధీభవన్ వదిలా: జీవన్ రెడ్డి

Published on Wed, 01/21/2026 - 20:00

సాక్షి హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వారికి కాంగ్రెస్‌లో పెద్ద పీట వేస్తే వారి పక్కన ఎలా కూర్చుంటామని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.10 ఏళ్లు బీఆర్ఎస్ పై తాము పోరాటం చేసిన నాయకులకు కాంగ్రెస్‌లో పెద్దపీట వేస్తే  కేత్రస్థాయిలో ఉన్న నాయకులకు ఏమని సమాధానం చెప్తామని ప్రశ్నించారు.  అందుకే అది  జీర్ణించుకోలేకపోయానని, పీసీసీకి క్షమాపణలు చెప్పి   గాంధీ భవన్‌ నుంచి బయిటకి వెళ్లిపోయానని జీవన్ రెడ్డి తెలిపారు.

స్పీకర్‌తో తానే స్వయంగా పార్టీ మారలేదని చెప్పారని అలాంటి వారిని సమావేశానికి పిలవాల్సిన అవసరమేముందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన నాయకులను చులకన చేస్తున్నారని పార్టీలో ఇటువంటి పరిస్థితి వస్తుందని తాను ఉహించలేదన్నారు. నిన్నటి వరకూ సైతం  బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాల పై పోరాటం చేశాను. ఇప్పుడేమో మీటింగ్ లో అలాంటి వ్యక్తి ని పక్కను కూర్చోబెట్టారు. రాజ్యాంగాన్ని  ఉల్లంగించిన వ్యక్తి ని పార్టీ అంతర్గత సమావేశంలో కూర్చోబెట్టడం ఏంటని ప్రశ్నించారు.

ప్రస్తుతం జరుగుతున్న సమావేశం పార్టీ విధానానికి రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియాగాంధీ విధానానికి వ్యతిరేకంగా జరుగుతుందన్నారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అప్రతిష్ఠ తెచ్చేలా ఈ సమావేశం జరిగిందన్నారు. నాలుగు దశాబ్దాలుగా తాను కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని కాంగ్రెస్ పార్టీ తనకు ఎంతో విలువ ఇచ్చిందని జీవన్ రెడ్డి తెలిపారు.

తాను ఎన్నో కష్టాలు భరించి పార్టీలో ఉన్నానని ఇప్పుడు దాని నుండి ఎందుకు వెళ్లిపోతానన్నారు. కాంగ్రెస్ తనపార్టీ అని కేవలం ఈ రోజు జరిగిన మీటింగ్‌కు మాత్రమే నిరసనగా బయిటకి వెళుతున్నానని తెలిపారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)