Breaking News

జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Published on Mon, 10/28/2024 - 16:47

హైదరాబాద్‌, సాక్షి:  జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో రాజ్‌ పాకాల పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజులు సమయం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారమే విచారణలో ముందుకు వెళ్లాలని కోర్టు పోలీసులకు సూచించింది. 

మోకిలా పోలీసులు కేటీఆర్ బావమరిది రాజ్‌ పాకాలకు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ యాక్ట్ 35(3) సెక్షన్ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్‌ పాకాల ఇంట్లో లేకపోవడంతో ఓరియన్ విల్లాస్‌లోని నెంబర్ 40 విల్లాకు ఈ నోటీసులను పోలీసులు అంటించిన విషయం తెలిసిందే. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో రాజ్ పాకాల  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ పాకాల దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారించింది.  పిటిషన్‌ తరఫు న్యాయవాది మయూర్ రెడ్డి.. వాదనలు వినిపించారు. 

‘‘రాజ్ పాకాల ఇంట్లో పార్టీ చేసుకుంటే అక్రమంగా పోలీసులు వచ్చి దాడి చేశారు. రాజ్ పాకాల ఉద్యోగికి డ్రగ్ పాజిటివ్ వస్తే.. రాజ్ పాకాలను నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్ టెస్ట్‌కు సాంపుల్ ఇవ్వాలని మహిళలను ఇబ్బంది పెట్టారు.  ప్రతిపక్ష నేత కేటీఆర్ బావమరిది కనుకనే ఆయన్ను టార్గెట్ చేశారు.  రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారు’’ అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘ మేము అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అక్రమంగా మద్యం బాటిళ్లు లభించడంతో పాటు ఒక వ్యక్తికి డ్రగ్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. ఇందులో రాజకీయ దురుద్దేశం లేదు. రాజ్ పాకాలకు నిబంధనల ప్రకారమే 41a నోటీసులు ఇచ్చాం’’ అని కోర్టుకు ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

తర్వత మళ్లీ.. రాజ్ పాకాల న్యాయవాది మయూర్‌ రెడ్డి వాదనలు నిపించారు. ‘‘ రాజ్ పాకాలకు ఈరోజు ఉదయం 9:30 గంటలకు నోటీసు ఇచ్చి ఉదయం 11.00 గంటలకు విచారణకు రమ్మన్నారని తెలిపారు. ‘‘ మాకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు.  విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. విచారణలో సమాచారం లేదా ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటాం’’ అని ఏఏజీ కోర్టుకు తెలిపారు.

చదవండి: జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో​ మరో ట్విస్ట్‌!

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)