Breaking News

భార్య ఉండగా మరో పెళ్లి చేసుకున్న అనిల్‌..!

Published on Sat, 02/28/2026 - 09:54

జగిత్యాలక్రైం: భార్య, మూడేళ్ల కూతురు ఉండగా విడాకులు తీసుకోకుండానే మరో యువతిని ప్రేమ పేరుతో వివాహం చేసుకున్న వ్యక్తిపై ఆమె కుటుంబ సభ్యులు దాడిచేసిన ఘటన శుక్రవారం రాత్రి జగిత్యాల పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో సఖీ కేంద్రం వద్ద జరిగింది. వివరాలు.. మల్యాల మండలం లంబాడిపలి్లకి చెందిన అనిల్, ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోగా, వీరికి మూడేళ్ల కూతురు ఉంది. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుండగా, అనిల్‌ కరీంనగర్‌ మండలానికి చెందిన యువతిని ప్రేమపేరుతో వంచించి ఈనెల 21న పెళ్లి చేసుకున్నాడు.

 విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియడంతో మల్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనిల్‌ను, పెళ్లి చేసుకున్న యువతిని పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కాగా, అనిల్‌కు భార్య, కూతురు ఉందని తెలియడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని పోలీసులు జగిత్యాల సఖీ కేంద్రానికి తరలించారు. శుక్రవారం సాయంత్రం సఖీ కేంద్రానికి యువతి కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకోగా కేంద్రం నిర్వాహకులు ఆమెకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుండగా అనిల్‌ వెళ్లి గొడవకు పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు అనిల్‌పై దాడి చేశారు.

 పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై సదాకర్, కుమారస్వామి ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన అనిల్‌ను జగిత్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. అనిల్‌ తల్లి దేవమ్మ ఫిర్యాదు మేరకు ఆరుగురితో పాటు, మరికొంత మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పట్టణసీఐ తెలిపారు. కాగా, కులాంతర వివాహం చేసుకోవడం వల్లే దాడి జరిగిందని వదంతులు రావడంతో పోలీసులు అప్రమత్తమై లోతైన విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగుచూశాయి. అనిల్‌కు భార్య, కూతురు ఉండగా ప్రేమ వివాహం చేసుకోవడం చట్టరీత్య నేరం కావడంతో యువతికి సఖీ కేంద్రంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుండగా దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)