Breaking News

రాష్ట్రంలో మళ్లీ పెరిగిన వేడి

Published on Sun, 05/26/2024 - 06:17

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా నమోదయ్యాయి. శనివారం నిర్మల్‌ జిల్లా కుబీర్‌లో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌లో 44.9 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డి జిల్లా డోంగ్లి 44.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌ జిల్లా బేలాలో 44.7 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్‌ జిల్లా వయల్పూర్‌ 44.6 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున అధికంగా నమోదయ్యే అవకాశముందని వివరించింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే....గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 44.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో 25.2 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున నమోదైంది.  

తీవ్ర వాయుగుండంగా మారిన వాయుగుండం 
మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం తూర్పు, మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు తెలిపింది. రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు తెలిపింది.

శనివారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లలో) 
కేంద్రం        గరిష్టం 
అదిలాబాద్‌    44.0 
మెదక్‌    42.7 
నిజామాబాద్‌    42.4 
హైదరాబాద్‌    39.9 
హకీంపేట్‌    39.8 
నల్లగొండ    39.5 
దుండిగల్‌    39.5 
రామగుండం    38.8 
హనుమకొండ    38.0 
మహబూబ్‌నగర్‌    37.5 
ఖమ్మం    36.0 
భద్రాచలం    31.6

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)