Breaking News

కూతురు పుట్టిందని.. సెల్‌ఫోన్లు పంచిపెట్టారు!

Published on Tue, 12/17/2024 - 19:38

సారంగాపూర్‌: కూతురు పుట్టడంతో.. మహాలక్ష్మి పుట్టిందని ఆ దంపతులు సంబరపడ్డారు. తమ సంతోషాన్ని పదిమందితో పంచుకోవాలని సంకల్పించారు. ఈ మేరకు వారు సోమవారం గ్రామంలోని 25 మంది ఆటో డ్రైవర్లకు రూ.3.5 లక్షల విలువ చేసే సెల్‌ఫోన్లు బహూకరించారు. మరో 1,500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దీనికి జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం తుంగూర్‌ వేదికగా మారింది. 

గ్రామానికి చెందిన ఓగుల అజయ్, అనీల దంపతులకు 18 రోజుల క్రితం కూతురు జన్మించింది. దీంతో తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడ్డారు. ఆ సంతోషంతో గ్రామంలోని ప్రతి ఆడబిడ్డకు (1,500 మంది మహిళలకు) ఇటీవల చీరలు పంపిణీ చేశారు. తాజాగా ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కటి రూ.14 వేల విలువైన సెల్‌ఫోన్‌ అందజేశారు.

అజయ్‌ పెళ్లికి ముందు ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ.30 కోట్ల ప్రైజ్‌మనీ వచ్చింది. తరువాత స్వదేశానికి వచ్చిన ఆయన.. శ్రీకృష్ణ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల చదువుకు.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, ఆలయాల నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు. 

చ‌ద‌వండి: ఒక్కరే టీచర్‌.. ఇద్దరు విద్యార్థులు

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)