Breaking News

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నపై ‘జాగృతి’ దాడి..

Published on Mon, 07/14/2025 - 05:27

మేడిపల్లి/ఘట్‌కేసర్‌: ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కు చెందిన క్యూన్యూస్‌ కార్యాలయంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చెందిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని క్యూన్యూస్‌ ఆఫీస్‌లోకి ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో సుమారు 20 మంది కర్రలు, రాడ్లతో దూసుకొచ్చి చానల్‌ సిబ్బందిపై దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారు. అక్కడే ఉన్న మల్లన్నపై కూడా దాడికి ప్రయతి్నంచారు. కార్యాలయంలోని ఫరి్నచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.

వారిని అదుపుచేసేందుకు మల్లన్న గన్‌మెన్‌లు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ లోపుగా మల్లన్న మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా   స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. గాయపడిన ఆఫీస్‌ సిబ్బందిని, మల్లన్నను చికిత్స నిమిత్తం ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లన్న చేతికి స్వల్ప గాయం కావడంతో చికిత్స అందించి ఆస్పత్రి నుంచి పంపించారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్‌ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలే ఈ దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 

దాడులకు భయపడను: మల్లన్న 
తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడిని తీన్మార్‌ మల్లన్న తీవ్రంగా ఖండించారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టంచేశారు. దాడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘20 మంది వరకు కర్రలు, రాడ్లతో దూసుకొచ్చి నాతోపాటు మా కార్యాలయం సిబ్బందిపై పాశవికంగా దాడి చేశారు. నాతో సహా పలువురికి గాయాలయ్యాయి. దాడి తీవ్రతను చూసి వెంటనే గన్‌మెన్‌ గాల్లోకి ఐదు రౌడ్లు కాల్పులు జరిపారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఇలాంటి దాడులకు బయపడేది లేదు. కంచం–మంచం అనే పదం తెలంగాణలో ఊతపదం. నా వ్యాఖ్యలకు కట్టుబడి వున్నా.

రౌడీల్లా నాపై దాడి చేయడమే కాకుండా మళ్లీ నాపైనే కేసు పెట్టారు. నా ఆఫీస్‌లో నా రక్తాన్ని కళ్లచూశారు. ఈ రక్తం మరకలతోనే ప్రజల్లోకి వెళతాను. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలి’అని డిమాండ్‌ చేశారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ గోవింద్‌ రెడ్డి తమ సిబ్బందితో ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడి ఘటనలో గాయపడ్డ ఆందోళనకారులు రాంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మేడిపల్లి పోలీసుల అదుపులో జాగృతి యాదాద్రి జిల్లా అధ్యక్షుడు సందుపట్ల సుజిత్‌రావు, ఓయూ జాగృతి అధ్యక్షుడు ఆశోక్‌ యాదవ్‌తోపాటు మరికొందరు ఉన్నట్లు తెలిసింది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)