Breaking News

వైఎస్సార్‌ పిలిస్తే కాంగ్రెస్‌లోకి వచ్చా

Published on Mon, 12/15/2025 - 02:57

సాక్షి, హైదరాబాద్‌: తాను హరీశ్‌రావుపై కోపంతో బీఆర్‌ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లోకి వెళ్లానని కేసీఆర్‌ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కవిత చెప్పిన మాటల్లో వాస్తవం లేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జ గ్గారెడ్డి పేర్కొన్నారు. నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు తాను కాంగ్రెస్‌లోకి వచ్చా నని స్పష్టం చేశారు. ‘నేను బీఆర్‌ఎస్‌ను వీడడానికి, హరీశ్‌రా వుకు సంబంధం లేదు. అసలు ఆయన కారణమే కాదు. 

నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మని నా మిత్రుడు జెట్టి కుసుమకుమా ర్‌తో వైఎస్సార్‌ ఆహ్వానం పంపారు. నా రాజకీయం నచ్చి పిలిపించారు. కాంగ్రెస్‌లో చేరమన్నారు. సంగారెడ్డి నియోజ కవర్గానికి ఐఐటీతో పాటు ఫోర్‌లేన్‌ హైవే ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నారు. అసలు కవితకు అప్పు డు రాజకీయాల్లో అ, ఆ లు కూడా రావు. మరోమా రు ఇలాంటివి మాట్లాడొద్దు..’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

హరీశ్‌తో వార్‌ నడుస్తూనే ఉంటుంది..
కేసీఆర్‌ కుమార్తె కాబట్టి కవిత లీడర్‌ అయిందని, తాను వ్యక్తిగతంగా ఎదిగిన నాయకుడినని జగ్గారెడ్డి అన్నారు. వాళ్ల పంచాయతీలోకి నన్ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో హరీశ్‌రావుకు, తనకు మధ్య వార్‌ నడుస్తూనే ఉంటుందని చెప్పారు. తాను డైరెక్ట్‌గా రాజకీయం చేస్తే, హరీశ్‌రావు వెనుక నుంచి పొడిచే రాజకీ యం చేస్తాడని ఆరోపించారు. 

తాను రాజకీయంగా కొంత డిస్టర్బ్‌ అయ్యానని ఆయన పేర్కొన్నారు. అయితే ఎందుకు మానసికంగా చలించాననే విషయం సమయం వచ్చిన ప్పుడు చెపుతానని, మేలో అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. తాను ఒక్కసారి డిసైడయ్యాక మళ్లీ వెనుకకు వచ్చే మనిషిని కాదని, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి మీద కూడా ఆసక్తి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)