Breaking News

నిర్మాత దిల్‌ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు

Published on Tue, 01/21/2025 - 07:18

సాక్షి,హైదరాబాద్‌: నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దిల్‌రాజు ఆఫీస్‌, కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్‌రాజు సోదరుడు శిరీశ్‌, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో 8 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

కాగా, సంక్రాంతికి భారీ బడ్జెట్‌తో ‘గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాము’ సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్స్‌ తీసింది. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో బడా ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న దిల్ రాజు.. డిస్టిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారారు.

బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాం : దిల్‌ రాజు భార్య
దిల్‌ రాజు భార్య తేజస్వినిని అధికారులు బ్యాంక్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తేజస్విని మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇవాళ ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బ్యాంకు వివరాలు కావాలని అధికారులు అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాం’’ అని ఆమె చెప్పారు.

మెత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలోనూ ఐటీ  తనిఖీలు
మెత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మైత్రీ నవీన్, సీఈవో చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప-2 వరల్డ్ వైడ్‌గా దాదాపు 1850 కలెక్షన్లు రాబట్టింది. సింగర్ సునీత భర్త రాముకు చెందిన మ్యాంగో మీడియా సంస్థలో కూడా సోదాలు చేస్తున్నారు.

 

నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు

ఇదీ చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్.. రిలీజ్‌ అప్పుడేనన్న అనిల్ రావిపూడి!

 

 

 

 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)