Breaking News

పుప్పాలగూడలో ఐటీ నాలెడ్జ్‌ హబ్‌

Published on Fri, 04/18/2025 - 03:42

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివార్లలోని పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. మొదటి దశ కింద 450 ఎకరాల్లో ఏర్పాటుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గతంలో ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్, రెవెన్యూ అధికారులకు, స్పెషల్‌ పోలీసు మ్యూచువల్‌ కో ఆపరేటివ్‌ సొసైటీకి కేటాయించిన 200 ఎకరాలతో పాటు, పారిశ్రామికాభివృద్ధి సంస్థకు చెందిన మరో 250 ఎకరాల స్థలంలో ఐటీ నాలెడ్జ్‌ హబ్‌ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

గురువారం సాయంత్రం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖల కీలక అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. పుప్పాలగూడలో భూముల లభ్యతపై అధికారులు వివరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులకు కేటాయించిన భూములను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సొసైటీలకు కేటాయించిన భూముల పక్కనే ఇండ్రస్టియల్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన సుమారు 250 ఎకరాల భూమి ఉందని తెలిపారు. మొత్తంగా 450 ఎకరాలు అందుబాటులో ఉందని వివరించారు. చెప్పారు. మొదటి దశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ హబ్‌ ద్వారా 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.  

ప్రత్యామ్నాయంగానేనా..? 
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (హెచ్‌సీయూ)ను అనుకుని ఉన్న 400 ఎకరాల భూమిని అభివృద్ధి చేసి 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా, దానిపై వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. కంచ గచ్చిబౌలి భూముల్లో 100 ఎకరాల్లో తొలగించిన చెట్ల స్థానంలో మళ్లీ వృక్షాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో దీనికి ప్రత్యామ్నాయంగా అత్యవసరంగా ప్రభుత్వం పుప్పాలగూడలో నాలెడ్జ్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)