Breaking News

ఐపీఎస్‌ అధికారి మహంతికి హైకోర్టులో ఊరట

Published on Mon, 03/24/2025 - 13:19

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణాకు చెందిన ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ మహంతి(IPS officer Abhishek Mohanty)కి హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్‌లో విచారణ ముగిసే వరకు తెలంగాణలోనే అభిషేక్‌ మహంతి విధులు నిర్వహించాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో అభిషేక్ మహంతికి  ఉపశమనం లభించింది.

తెలంగాణ నుంచి ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీకి బదిలీచేస్తూ డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. వీరిలో అభిషేక్ మహంతి ఒకరు. అయితే ఆయన తనను ఆంధ్రప్రదేశ్‌కు పంపడంపై  అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్‌)ను ఆశ్రయించారు. ప్రస్తుతం క్యాట్‌లో అభిషేక్ మహంతి పిటీషన్ పై విచారణ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో  గతంలో డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులపై క్యాట్‌లో విచారణ ముగిసేంత వరకూ ఆయన బదిలీని నిలిపేయాలని, అప్పటి వరకూ తెలంగాణలోనే ఆయన విధులు నిర్వహించవచ్చని హైకోర్టు(High Court) పేర్కొంది.

రాష్ట్ర విభజన సమయంలో మహంతికి కేటాయించిన ఏపీలో ఆయన విధులలో చేరాలని కేంద్రం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతి  క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్‌ కేంద్ర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు  నిరాకరించింది. దీంతో క్యాట్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ, ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ తిరుమలాదేవీ ధర్మాసనం విచారణ చేపట్టింది. మహంతి గురువారం ఏపీలో చేర్చాల్చి ఉండటంతో నేటి (సోమవారం) వరకు కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసింది.

ఇది కూడా చదవండి: కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)