Breaking News

అమ్మేందుకే ఆయుధాలు చోరీ!

Published on Sun, 09/13/2026 - 02:49

సాక్షి, హైదరాబాద్‌: బొల్లారం ఆర్మీ ఏరియాలో తీవ్ర కలకలం సృష్టించిన ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు మల్లేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి, కేసును మరింత వేగవంతం చేశారు. చోరీ చేసిన సైనిక ఆయుధాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో స్పష్టమైంది. కేసులోతుల్లోకి వెళ్లే కొద్దీ మల్లేశ్‌ వెనక పెద్ద అక్రమ ఆయుధాల నెట్‌వర్క్‌ ఉన్నట్లు పోలీసులకు సంచలన ఆధారాలు లభించాయి. 

నిందితుడు ఫోన్‌ ఆధారంగా జరిపిన ప్రాథమిక దర్యాప్తులో అంతర్జాతీయ, అంతరాష్ట్ర అక్రమ ఆయుధాల వ్యాపారులతో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు తేలింది. మల్లేశ్‌  తన మొబైల్‌ ద్వారా సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌ వేదికగా దేశీయ ఆయుధ సరఫరాదారులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులకు దొరకకుండా నిందితుడు తన ఫోన్‌లోని కీలక వాట్సాప్‌ చాట్‌లు, ఆడియో, వీడియో కాల్స్‌ రికార్డ్‌లు, లాగ్‌లను డిలీట్‌ చేసినట్లు తేలింది. ప్రస్తుతం సైబర్‌ క్రైమ్‌ నిపుణులు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) టీమ్‌ సహకారంతో డిలీట్‌ అయిన వాట్సాప్‌ మెసేజ్‌లు, మీడియా ఫైళ్లు, కాల్‌ డేటా రికార్డ్‌లను వెలికితీసే పనిలో పడ్డారు. 

కాగా, విశాలమైన ప్రాంగణం, కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉండే ఆర్మీ ఏరియా నుంచి కేవలం ఒక్కడే ఆయుధాలు చోరీ చేయడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీలోని ఇంటి దొంగల సహకారం కూడా తప్పకుండా ఉంటుందనే కోణంలో ఆరా తీస్తున్నారు. కొట్టేసిన ఆయుధాలను మల్లేశ్‌ ఎవరికి విక్రయించేందుకు ఒప్పందాలు చేసుకున్నాడు? గ్యాంగ్‌స్టర్లకా లేక నేరస్తులకా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అలాగే డిజిటల్‌ పేమెంట్లు, హవాలా లేదా బ్యాంక్‌ ఖాతాల ద్వారా ఎంత మొత్తం చేతులు మారిందనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు.

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)