Breaking News

పరీక్షల్లో గిన్ని మార్కులతో పాసయితివి.. ఉత్తగ సచ్చిపోతివి బిడ్డా..

Published on Tue, 05/09/2023 - 19:04

సాక్షి, మహబూబాబాద్‌: పరీక్షల్లో ఫెయిల్‌ అయి కొందరు విద్యార్థుల.. పరీక్షలు ఫలితాలు వెలువడక ముందే మరొకొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో విద్యార్ధులు తీసుకునే నిర్ణయాలు వారి తల్లిదండ్రులకు తీరాని శోకాన్ని నింపుతున్నాయి. పరీక్ష ఫలితాలే జీవితాలను మార్చలేవని విద్యార్థులు తెలుసుకోవాలని పేరెంట్స్‌ చెబుతున్నా కొందరు మాత్రం మారడం లేదు. 

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఫలితాలు వెలువడక ముందే భయంతో ఇంటర్‌ విద్యార్థి గుగులోతు కృష్ణ(19) ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. కేసముద్రం మండలం పిక్లా తండా శివారు బోడగుట్ట తండాకు చెందిన ఇంటర్‌ విద్యార్థి గుగులోతు కృష్ణ(19) ఇంటర్‌ చదువుతున్నాడు. కాగా, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో తనకు మంచి మార్కులు రావనే ఆలోచనతో ఆవేదనకు గురయ్యాడు. ఈ ‍క్రమంలో ‘అమ్మ, నాన్న నన్ను క్షమించండి .. నాకు ఎంబీబీఎస్‌లో సీటు రాదు. అందుకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్‌ నోట్‌ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

అయితే, మంగళవారం ఉదయం వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో కృష్ణ.. బైపీసీలో 892/1000 మార్కులు సాధించాడు. ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇక, ఫలితాలు చూసిన అనంతరం.. కృష్ణ పేరెంట్స్‌ కన్నీటిపర్యంతమయ్యారు. ‘కొడుకా.. లేనిపోని అనుమానంతో ఉరేసుకొని చనిపోతివి.. ఇప్పుడు ఇంటర్‌ పరీక్షల్లో గిన్ని మార్కులతో పాసయితివి’ అంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

ఇదిలా ఉండగా.. కృష్ణ కల్వల ఆదర్శ పాఠశాలలో పదోతరగతి వరకు పూర్తి చేసి ఏటూరు నాగారంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌ బైపీసీలో చేరాడు. ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. కృష్ణ చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్‌ చేయాలనే కోరికతో కష్టపడి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్‌ పూర్తి చేసి నీట్ పరీక్షకు సన్నద్ధమయ్యాడు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నానని అతనిలో నిరాశ మొదలైంది. తనకు ఎంబీబీఎస్‌లో సీటు రాదని ఆవేదన చెందాడు. దీంతో, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఇది  కూడా చదవండి: మహిళా ప్రయాణికులకు రూ.80 కే టీ–24 టికెట్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)