Breaking News

TS Inter Result 2025: ఈసారి కూడా అమ్మాయిలదే హవా

Published on Wed, 04/23/2025 - 08:45

సాక్షి, (హైదరాబాద్‌​): ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో మళ్లీ అమ్మాయిల హవానే కొనసాగింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరోసారి సత్తా చాటారు. కాగా.. రాష్ట్ర స్థాయిలోనే ఫస్టియర్‌లో మేడ్చల్‌– మల్కాజిగిరి ప్రథమ స్థానంలో నిలవగా, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. సెకండియర్‌లోనూ ఈ రెండు జిల్లాలు  మూడు, నాలుగో స్థానాలను కైవసం చేసుకున్నాయి. హైదరాబాద్‌ జిల్లా మరోసారి చతికిలపడి నిరాశే మిగిలి్చంది. మొత్తమ్మీద ఇంటరీ్మడియట్‌ ఫలితాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌కు 73 శాతం ఉత్తీర్ణత లభించింది. గత ఏడాది కంటే 3 శాతం ఉత్తీర్ణత పెరిగింది.   

ఉత్తీర్ణత ఇలా.. 
గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్, వృత్తి విద్యా కోర్సులతో కలిపి 73.41 శాతం, ద్వితీయ సంవత్సరంలో 73.39 శాతం ఉత్తీర్ణత లభించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ప్రథమ సంవత్సరంలో హైదరాబాద్‌లో 66.68 శాతం, రంగారెడ్డి జిల్లాలో 76.36, మేడ్చల్‌– మల్కాజిగిరి జిల్లాలో 77.21 శాతం, ద్వితీయ సంవత్సరంలో  మేడ్చల్‌ జిల్లా 77.91, రంగారెడ్డి 77.53,  హైదరాబాద్‌ 67.74 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

మరోసారి.. సత్తా చాటి.. 
ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఈ ఏడాది సైతం బాలికల హవానే కొనసాగింది. ప్రథమ సంవత్సరం జనరల్‌ కోర్సుల్లో ఫలితాలు పరిశీలిస్తే.. మేడ్చల్‌– మల్కాజిగిరిలో బాలికలు 82.40 శాతం, బాలురు 73.54, రంగారెడ్డి జిల్లాలో 81.92 బాలికలు, 72.24 బాలురు, హైదరాబాద్‌ జిల్లాలో 74.65 బాలికలు, 60.47 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో.. మేడ్చల్‌లో 82.21 బాలికలు, 74.56 బాలురు, రంగారెడి జిల్లాలో 82 శాతం బాలికలు, 73.70 బాలురు, హైదరాబాద్‌ జిల్లాలో  బాలికలు 74.81, బాలురు 59.50 శాతం చొప్పున ఉత్తీర్ణులయ్యారు.  


 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)