amp pages | Sakshi

బుర్ర బద్దలయ్యేలా పని చేస్తున్నారా? అంతొద్దు.. లాభమేమీ లేదు!

Published on Sat, 02/18/2023 - 01:27

సాక్షి, హైదరాబాద్‌: మెదడు.. మన శరీరంలోని అత్యంత సంక్షిష్టమైన నిర్మాణం. ఆలోచనలు, కళలు, జ్ఞాపకాలు, సృజనాత్మకత, తార్కిక బుద్ధి ఇలా అనేక విషయాల్లో మనిషిని ఇతర జీవజాతులకన్నా ఉన్నతంగా, విభిన్నంగా నిలుపుతున్న అవయవం. కోట్లాది న్యూరాన్ల కలబోతగా దైనందిన జీవితంలో చురుకైన పోషిస్తూ.. ఇన్ఫర్మేషన్‌–ప్రాసెసింగ్‌ పవర్‌హౌస్‌ పాత్ర పోషిస్తున్న ఓ మినీ సూపర్‌ కంప్యూటర్‌.

అయితే నేటి ఆధునిక కాలంలో మనలో రోజురోజుకూ పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లకు మెదడు సైతం ప్రభావితం అవుతోంది. ఫలితంగా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో మెదడుకు విశ్రాంతి ఇవ్వాల్సిన ఆవశ్యకత, ఇవ్వకుంటే కలిగే దుష్ప్రభావాలపై వైద్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటంటే... 

►మెదడుకు తగిన విశ్రాంతి ఇవ్వకుండా బుర్ర బద్దలయ్యేలా పని చేసేందుకు ప్రయత్నిస్తే దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలు అంతంత మాత్రమే. 

►మెదడు స్పాంజ్‌ లాంటిది. అది ఎంతవరకు సమాచారాన్ని భద్రపరచుకోగలదో అంతే చేయగలదు. అందువల్ల బ్రెయిన్‌కు నిత్యం రెస్ట్‌ అవసరమే. 

►పనిచేస్తున్న రోజుల్లో మధ్యలో విరామం తీసుకోవడం వల్ల మూడ్‌ బాగుకావడంతోపాటు పనితీరు, ఏకాగ్రత మెరుగుపడుతుంది. 

►మెదడుకు తగిన విశ్రాంతి ఇవ్వకపోతే అది అనారోగ్య సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఒత్తిళ్లకు కారణమవుతుంది. 

మెదడుకు విశ్రాంతి కోసం... 
కేవలం నిద్రలోనే మెదడుకు రెస్ట్‌ దొరుకుతుందనేది కూడా పూర్తిగా శాస్త్రీయం కాదని నిపుణులు అంటున్నారు. మెదడుకు ఎక్కువగా పని కల్పించకుండా ఉంచడం కోసం వివిధ రకాల ధ్యానాలు చేయడం కూడా సరైనదేనని నిపుణులు చెబుతున్నారు. వారి సూచనల ప్రకారం... 

►ప్రకృతిలో కాసేపు మమేకం కావాలి. 

►మెదడు రిలాక్స్‌ కావడానికి స్నానం కూడా దోహదపడుతుంది. 

►రాత్రిపూట 8 గంటల చొప్పున నిద్ర పోనివారు ఉదయం వేళల్లో కాసేపు కునుకు తీసినా మెదడు పనితీరు మళ్లీ చురుగ్గా మారుతుంది. 

►ఏదైనా ఓ ఆట ఆడటం లేదా శారీరక శ్రమతోనూ మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. 

►సెల్‌ఫోన్లు, సోషల్‌ మీడియా వాడకానికి రోజూ కాసేపు విరామం ఇవ్వడం ద్వారా కూడా మెదడు విశ్రాంతి పొందుతుంది. 

నిద్రలో బ్రెయిన్‌ వేవ్స్‌ నెమ్మదిస్తాయి...
సుఖనిద్ర సమయంలో బ్రెయిన్‌ వేవ్స్‌ (మెదడు కణాలు విద్యుత్‌ తరంగాల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకొనే ప్రక్రియ) నెమ్మదిస్తాయి. ఏదైనా విషయాన్ని 2–3 గంటలపాటు చదివాక కనీసం 15–20 నిమిషాలు నిద్రపోవడమో లేదా కళ్లు మూసుకొని మౌనంగా ఉంటే అది బాగా గుర్తుండిపోతుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలో ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ (ఆర్‌ఈఎం), నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ (ఎన్‌ఆర్‌ఈఎం) అనే పద్ధతులుంటాయి. ఆర్‌ఈఎంలో కలలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగ అంశాల వంటివి ప్రాసెస్‌ అవుతాయి.

మనం మెలకువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆదే యాక్టివిటీ కొనసాగుతుంది. నాన్‌ ఆర్‌ఈఎంలో అవి సరిగ్గా ప్రాసెస్‌ కాక మనసు కలతచెందేలా భంగం కలిగిస్తుంటాయి. బాగా నిద్రపోయినప్పుడు ఆయా అంశాలను క్రమపద్ధతిలో పెట్టేందుకు మెదడు పనిచేస్తుంటుంది. నాన్‌ ఆర్‌ఈఎంలో నిద్ర సరిగ్గా పట్టక జ్ఞాపకశక్తి తగ్గడం, భావోద్వేగాలను సరిగ్గా విశ్లేషించకపోవడం వల్ల కలత చెందడానికి కారణమవుతుంది.  

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)