Breaking News

Hyderabad: ‘అకాన్‌ ఆహ్వానం’! సిటీలో వినూత్నంగా ఫండ్‌ రైజింగ్‌ ఫీస్ట్‌..

Published on Thu, 08/15/2024 - 13:11

సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో నగరం వేదికగా ’అకాన్‌ ఆహ్వానం’ పేరుతో వినూత్నంగా ఫండ్‌ రైజింగ్‌ ఫీస్ట్‌ను గురువారం నిర్వహిస్తున్నారు. పేద కుటుంబాల్లో నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారుల సంరక్షణ, సహకారం అందించడం కోసం ఈ ఫీస్ట్‌ నిర్వహించడం విశేషం. దుర్గంచెరువు దగ్గరలోని అకాన్‌ 
రెస్టారెంట్‌ వేదికగా ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్స్‌ట్రామైల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ ఫండ్‌ రైజింగ్‌ ఫీస్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ చెఫ్‌లు తయారు చేసిన పసందైన ఆహార పదార్థాలను, సితార్‌ ప్రదర్శనను ఆస్వాదిస్తూ ఆరగించవచ్చు. లంచ్‌ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4  గంటల వరకు అందుబాటులో ఉంటుంది. లంచ్‌ అనంతరం చెల్లించే ప్రతిపైసా పేద కుటుంబాల్లోని ప్రీ మెచ్యూర్డ్‌ చిన్నారులకు, అనారోగ్యాలతో జన్మించిన శిశువులకు విరాళంగా అందిస్తారు. సామాజిక బాధ్యతగా ఈ వినూత్నమైన ఆహారానికి, ఆతిథ్యానికి ఎంతైనా చెల్లించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఒక్కో శిశువుకు రూ.10 లక్షల వరకు..
నెలలు నిండని శిశు జననాల సంఖ్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బతుకు గడవడమే కష్టంగా మారిన పేద కుటుంబాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఇలాంటి శిశువులకు, వారి కుటుంబాల చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఎక్స్‌ట్రామైల్‌ ఫౌండేషన్‌ కృషి చేస్తోంది. ’అకాన్‌ ఆహ్వానం’ ఫండ్‌ రైజింగ్‌ ఫీస్ట్‌లో పోగైన ప్రతి పైసా ప్రీమెచ్యూర్డ్‌ చిన్నారులకు, అనారోగ్యంతో జన్మించిన శిశువులకు చేరుతుంది. మా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి హాస్పిటల్‌లో ఉండే ఎన్‌ఐసీయూ యూనిట్ల ద్వారా సహాయం అవసరమైన శిశువులకు సహకారం అందిస్తున్నాం. ఇప్పటి వరకు 197 మంది చిన్నారులకు సహకారం అందించాం. 400 గ్రాముల బరువుతో జన్మించిన చిన్నారులను రక్షించాలంటే రూ.10–15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇతర సమస్యలతో జన్మించినా కనీసం రూ.3, 4 లక్షలు అవసరం. ఒక్క లంచ్‌ ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది. లంచ్‌ రిజర్వేషన్ల కోసం ఫోన్‌: 96496 52222 – డా.నిటాషా, ఎక్స్‌ట్రామైల్‌ ఫౌండేషన్‌

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)