Breaking News

ఇన్నోవేషన్స్‌.. కేరాఫ్‌ వింగ్స్‌ ఇండియా

Published on Fri, 01/30/2026 - 04:43

సాక్షి, హైదరాబాద్‌/సనత్‌నగర్‌: హైదరాబాద్‌లోని బేగంపేట్‌ విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్‌ ఇండియా–2026 విమానయాన ప్రదర్శనలో విమానాల సాంకేతికతతోపాటు డ్రోన్లలో వచ్చిన ఆధునిక మార్పులు వావ్‌ అనిపిస్తున్నాయి. ఇక్కడ మల్టీరోటర్‌ మావీయోమ్‌ ఎక్స్‌4 డ్రోన్‌ ద్వారా గూగుల్‌ ఎర్త్‌కు సంబంధించి యూఏవీ ఫొటోలను ఎలా సేకరించవచ్చో, అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఫారెస్ట్‌ ట్రాకింగ్, సర్వైలెన్స్, డిటెక్షన్, పొల్యూషన్‌ డిటెక్షన్, మ్యాపింగ్, మైనింగ్‌ ప్రాంతాల గుర్తింపు, 3డీ ల్యాండ్‌ మోడలింగ్‌ ఇలా డ్రోన్లను ఏవిధంగా ఉపయోగించవచ్చో తెలిపే వినూతన స్టాల్స్‌ వెలిశాయి. 

ఈ ప్రదర్శనలో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన తిహన్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ అభివృద్ధి చేసిన అత్యాధునిక డ్రోన్‌ సాంకేతికత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ డ్రోన్‌ ప్రధానంగా అటానమస్‌ నావిగేషన్‌ సాంకేతికతపై పనిచేస్తుందని తిహన్‌ సీనియర్‌ రీసెర్చర్‌గా పనిచేస్తున్న షేక్‌ జానీ బాషా తెలిపారు. భూమిపై నడిచే వాహనాలు, గగనతలంలో ప్రయాణించే డ్రోన్లకు స్వయంచాలక మార్గనిర్దేశం చేయడమే దీని ప్రత్యేకత. 

ఈ డ్రోన్‌ను ముఖ్యంగా సైనిక అవసరాల కోసం ఆయుధాలు లేదా సరుకులు రవాణా చేయడానికి రూపొందించినప్పటికీ, అవసరాన్ని బట్టి వాణిజ్య అవసరాలకూ వినియోగించవచ్చన్నారు. ఈ డ్రోన్‌ గరిష్టంగా 150 కిలోల బరువు మోయగల సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు.  

19 సీట్ల సామర్థ్యం కలిగిన హిందూస్తాన్‌ 228 విమానం అచ్చంగా దేశీయ తయారీ విమానం. దీనికి సంబంధించిన ప్రతి ముడి ఉత్పత్తిని భారత్‌లోనే రూపొందించారు. విమానయాన రంగంంలో సగర్వంగా భారత కీర్తిని చాటిచెప్పే ఈ విమానం వద్ద ఫొటోలు దిగేందుకు సందర్శకులు ఉత్సుకత కనబరిచారు. దీని టేకాఫ్‌ వెయిట్‌ 6,200 కిలోలు, ఫ్యూయల్‌ కెపాసిటీ 2,250 కిలోలు. 

భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్‌ టీమ్‌ బృందంలో సభ్యురాలిగా ఉన్న మహిళా పైలట్‌ కన్వల్‌ సంధు, మరోపైలట్‌ సంజయ్‌లు వైమానిక విన్యాసాలు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. విమానయాన రంగంలో మహిళలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, యువతులు ధైర్యంగా ముందడుగు వేయాలని కన్వల్‌ సంధు ‘సాక్షి’కి తెలిపారు. వింగ్స్‌ ఇండియా–2026లో శుక్ర, శనివారాల్లో సాధారణ ప్రజానీకానికి అనుమతి కల్పించారు. బుక్‌ మై షోలో గానీ, విమానాశ్రయంలో ఉన్న టికెట్‌ కౌంటర్ల వద్ద గానీ రూ.వెయ్యి చెల్లించి టికెట్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)