Breaking News

దీపావళి వేడుకల్లో గాయాలు.. సరోజినీదేవి ఆసుపత్రికి బాధితులు క్యూ..

Published on Fri, 11/01/2024 - 07:09

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి వేడుకల్లో పలు చోట్ల అపశృతులు చోటుచేసుకున్నాయి. బాణసంచా కాలుస్తూ పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులంతా సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. ఇప్పటివరకు 40 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. కాగా, గాయాలపాలైన వారికి చికిత్స కోసం సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య  బృందాలను ఏర్పాటు చేసింది. వంద బెడ్లు వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. 9 మందికి తీవ్ర గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ఈసారి ప్రజల్లో అవగాహన పెరిగిందని.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేసులు తగ్గుతాయని ఆశిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. టపాసుల దుకాణాలతో మార్కెట్లు, కిటకిటలాడాయి. చిన్నాపెద్దా పెద్ద బాణసంచా పేలుస్తూ ఆనందంగా గడిపారు. కాగా, దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు.

అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్‌ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు.

దీపావళి వేడుకల్లో అపశ్రుతి..ఆస్పత్రికి క్యూ

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)