Breaking News

మహిళను కట్టేసి చితకబాదిన దాయాదులు

Published on Sat, 08/16/2025 - 07:57

మోపాల్‌ (నిజామాబాద్‌ రూరల్‌): నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని సింగంపల్లి గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను దాయాదులు గుంజకు కట్టేసి చితకబాదిన సంఘటన రెండురోజుల తర్వాత వెలుగు లోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరా లు.. గ్రామానికి చెందిన పల్లికొండ సవిత మతిస్థిమితం లేని భర్త, నలుగురు పిల్లలతో జీవనం సాగిస్తోంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. సవిత ఇంటి ఎదుట నున్న స్థలంలో ఆమె తోటికోడలు పల్లికొండ లక్ష్మికి చెందిన గేదెలు, గొర్రెలు ఉంటాయి. 

గొర్రెలు, గేదెలు తరచుగా సవిత ఇంట్లోకి వచ్చి మలమూత్రాలు విసర్జించడమే కాకుండా, బియ్యం తినడం వంటివి చేస్తున్నాయి. ఈ విషయమై సవిత పలుమార్లు లక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి కూడా గేదె సవిత ఇంట్లోకి వెళ్లి బియ్యాన్ని తొక్కి చిందరవందర చేయడంతో లక్ష్మిపై సవిత ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్ష్మి కోపంతో సవితను తిడుతూనే మంత్రాలు చేస్తున్నావని ఆరోపించింది. 

దీంతో ప్రమాణం చేద్దామని సవిత గేదెను తీసుకుని హనుమాన్‌ గుడి వద్దకు వెళ్లింది. అక్కడికి వచ్చిన లక్ష్మి సవితను హనుమాన్‌ ఆలయం వద్దనున్న పెద్ద గుంజకు(కట్టె) కట్టేసింది. లక్ష్మి కొడుకు గంగాధర్, కోడలు మమత, భర్త పల్లికొండ గంగాధర్‌ అక్కడికి చేరుకుని సవితపై దాడి చేశారు.  తనను వదిలిపెట్టాలని సవిత వేడుకున్నా కనికరించలేదు. గంట తరువాత స్థానిక మహిళలు జోక్యం చేసుకుని సవిత కట్లు విప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై జాడె సుస్మిత గురువారం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. పల్లికొండ గంగాధర్, లక్ష్మి, వారి కుమారుడు గంగాధర్, కోడలు మమతను అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై తెలిపారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)