Breaking News

మన గడ్డపై ఇండోనేసియా బూడిద! 

Published on Wed, 02/01/2023 - 01:31

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఇండోనేసియా పరిధిలోని సుమత్రా దీవుల్లో సుమారు 80 వేల ఏళ్ల కిందట ఓసారి, దాదాపు 75 వేల ఏళ్ల క్రితం మరోసారి అతిభీకరమైన పేలుళ్లతో రెండు సూపర్‌ వోల్కనోలు బద్దలయ్యాయి. వాటిలో రెండోసారి బద్దలైన టోబా అగ్నిపర్వతం రేపిన ఈ ధూళిని ‘యంగర్‌ టోబా టఫ్‌–2’గా ప్రపంచ పరిశోధకులు నామకరణం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆ దుమ్ము, ధూళి, బూడిద రేణువులు వాతావరణంలో వ్యాపించి కొన్నేళ్లపాటు ప్రయాణించి క్రమంగా భూమిపైకి చేరాయి. సముద్రంలో కొన్ని రేణువులు మేటలు వేయగా నదుల్లో పడ్డప్పుడు నీటి ప్రవాహంలో ముందుకు సాగి కొన్ని ప్రాంతాల్లో పేరుకుపోయాయి. ఏపీలోని బనగానపల్లి వద్ద జుర్రేరు సమీపంలోని జ్వాలాపురం, సాగిలేరు, తెలంగాణాలోని ఖమ్మం సమీపంలోని ముర్రేరు, మంజీరా పరీవాహక ప్రాంతాల్లో పేరుకున్నాయి. తాజాగా హస్తాల్‌పూర్‌లో కనిపించినవి అందులో భాగమే. 

రంగంలోకి దిగిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం... 
గతంలో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) వివిధ ప్రాంతాల్లో పరిశోధనలు చేపట్టి ఈ తరహా సుద్దమేటల రహస్యాన్ని ఛేదించగా తాజాగా తెలంగాణ పరిధిలోని హస్తాల్‌పూర్‌లో అదే తరహా సుద్దమేటల రహస్యం వెలుగులోకి వచ్చింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు భద్ర గిరీశ్‌ ఈ సుద్ద నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరిశీలించగా కిలో సుద్దలో దాదాపు 5 మిల్లీగ్రాముల దాకా గంధకం ఉన్నట్లు తేలింది.

అలాగే అగ్నిపర్వత లావాకు సంబంధించిన సూక్ష రేణువులు కనిపించాయి. ఇందులో కర్బనం లేకపోవడంతో ఇది సాధారణ బూడిద కాదని స్పష్టమైంది. ఈ విషయాన్ని జీఎస్‌ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్‌ చకిలం వేణుగోపాల్‌ దృష్టికి తీసుకువెళ్లగా ఇది సుమత్రా దీవుల్లో దాదాపు 75 వేల ఏళ్ల క్రితం బద్దలైన అగ్నిపర్వతం నుంచి వెలువడిన ధూళికణాలతో ఏర్పడ్డ మేటలేనని నిర్ధారించారు.  


ఇవి బూడిద మేటలు.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం హస్తాల్‌పూర్‌ ప్రాంతంలో అర కిలోమీటర్‌ మేర మేట వేసిన సుద్ద ముద్దలు. మంజీరా తీరంలో ప్రవాహం కోతకు గురైన ప్రాంతంలో ఈ మేటలు కనిపిస్తున్నాయి. ఇందులో పెద్ద విశేషం ఏముందంటారా? ఇక్కడే విస్తు గొలిపే, ఆసక్తిరేపే నేపథ్యం దాగి ఉంది. ఇవి వేల ఏళ్ల కిందట నాటివి!! పైగా సుమారు 3,200 కి.మీ. దూరం నుంచి గాలివాటానికి తరలి నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చాయి!!

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)