Breaking News

ఇందిరమ్మ పట్టాలు ఇప్పట్లో లేనట్టే!

Published on Thu, 03/14/2024 - 00:47

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సొంత స్థలం లేని నిరుపేదలకు ఇప్పట్లో ‘ఇందిరమ్మ గృహ’ వసతి అందే సూచనలు కనిపించటం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో రెవెన్యూ పరమైన అంశాల జోలికి వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం అవసరమైన పట్టాల పంపిణీ ఇప్పట్లో జరిగేలా లేదు. పథకం ప్రారంభించడానికి ఒకరోజు ముందు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది.

మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే కచ్చితంగా సొంత జాగా కలిగి ఉండాలని అందులో పేర్కొంది. తద్వారా సొంత స్థలాలు లేని వారికి ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లేదనే స్పష్టతనిచ్చింది. ఇటీవల నిర్వహించిన ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందని వారు 66 లక్షలుగా ఉన్నట్టు ప్రాథమికంగా తేల్చింది. ఇందులో 30 లక్షల మందికి సొంత జాగా లేదని కూడా తేలినట్టు సమాచారం. కాగా వారందరికీ ప్రభుత్వం తొలుత భూమి పట్టాలు జారీ చేసి ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. సొంత స్థలాలు లేని వీరంతా తదుపరి విడత కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది.  

లక్ష ఇళ్లపైనే దృష్టి: ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఏడాది కాలంలో లక్ష ఇళ్లకు మించి పూర్తి కావని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో తొలుత ఆ లక్ష ఇళ్లకు సరిపడా నిధులు సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ప్రక్రియ కాస్తా పూర్తయి, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అంటే జూలైలో ఈ ప్రక్రియ ఊపందుకుంటుంది. గ్రామ సభలు నిర్వహించి అర్హుల ఎంపిక పూర్తి అయ్యేసరికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

అప్పటికి కూడా వానాకాలం కొనసాగనున్నందున అక్టోబర్‌ తర్వాత గాని ఆ ప్రక్రియలో వేగం పెరగదు. అయితే వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకు కొన్ని సొంత నిధులు కలిపి లబ్ధిదారులు పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొన్ని కుటుంబాల్లో అర్థికపరమైన ఇబ్బందులకు కారణమవుతుంది. అలాంటి వారి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. ఈలోపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ క్రమంలో వచ్చే మార్చిలోపు కొన్ని ఇళ్లకే పూర్తి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అలా దాదాపు లక్ష ఇళ్లకే నిధులు అందించాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రభుత్వ అంచనా వేస్తోంది. 

నిధులు సిద్ధం! 
లక్ష ఇళ్లకు రూ.5 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటుంది. హడ్కో నిధుల కోసం గతంలోనే ప్రభుత్వం దరఖాస్తు చేయగా, ప్రస్తుతం రూ.3 వేల కోట్ల రుణం మంజూరైంది. ఇందులో రూ.1,500 కోట్లు మాత్రమే ఇప్పుడు విడుదల కానున్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం మొదటి కిస్తీగా రూ.1,000 కోట్లు మంజూరవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వెరసి రూ.2,500 కోట్లు అందుబాటులో ఉన్నట్టవుతుంది. కాగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ద్వారా కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధంగా లక్ష ఇళ్లకు నిధులు దాదాపు సిద్ధంగా ఉన్నట్టుగానే ప్రభుత్వం భావిస్తోంది.   

తక్కువ ఇళ్లే ఇచ్చినా ఎక్కువ శాతం కన్పించేలా.. 
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తొలుత చిన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ జనాభా ఉండే ప్రాంతాలను గుర్తించి, వాటిల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఆయా గ్రామాల్లో తక్కువ ఇళ్లనే అందించినా.. ఆ గ్రామ జనాభా, మంజూరు చేసిన ఇళ్ల దామాషాను చూస్తే ఎక్కువ శాతం ఇళ్లను కేటాయించినట్టు లెక్కలు కనిపిస్తాయి. అదే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు ఇచ్చే ఇళ్ల సంఖ్యను, ఆ ప్రాంత జనాభాను పరిగణనలోకి తీసుకుంటే తక్కువ ఇళ్లు కేటాయించినట్టుగా కన్పిస్తుంది. దీన్ని గమనంలో ఉంచుకునే తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.   

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు