Breaking News

ఇక ఆపుకోనక్కర లేదు

Published on Sun, 04/20/2025 - 01:31

సాక్షి, హైదరాబాద్‌: నీళ్లు తాగటానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచించే పరిస్థితి.. మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందనే భయం. మూత్ర విసర్జనకు వెళ్లాలంటే రైలు ఆగే స్టేషన్‌ రాకకోసం ఎదురుచూడాల్సిందే. అందుకు ఒక్కోసారి ఐదారు గంటలైనా పట్టొచ్చు. ఇది రైళ్లను క్షేమంగా గమ్యం చేర్చే లోకో పైలట్లు, సహాయ లోకోపైలట్ల దుస్థితి.

ముఖ్యంగా మహిళా లోకోపైలట్ల ఆవేదనపై సాక్షి పత్రిక ‘ఆపుకోలేని ఆవేదన’పేరిట కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఇంతకాలానికి రైల్వే శాఖ నిర్ణయించింది. రైళ్ల ఇంజిన్‌ క్యాబిన్‌ (లోకో)లలో యూరినల్స్, ఏసీ వసతి, ఆధునిక ఎర్గోనామిక్‌ సీట్ల ఏర్పాటును తప్పనిసరి చేసింది. దీంతో లక్షన్నర మంది లోకో, అసిస్టెంట్‌ లోకోపైలట్లకు పెద్ద ఉపశమనం లభించనుంది.  

యూరినల్స్‌ ఏర్పాటు ప్రారంభం 
కొత్తగా తయారు చేసే అన్ని లోకో క్యాబిన్‌లలో యూరినల్స్, ఏసీ, ఎర్గోనామిక్‌ సీట్ల ఏర్పాటు కోసం వాటి డిజైన్లను రైల్వేశాఖ మార్చింది. ఇప్పటికే వినియోగిస్తున్న లోకోమోటివ్‌లలో వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని లాలాగూడ, మౌలాలి లోకోòÙడ్లతోపాటు కాజీపేట, విజయవాడ, గుత్తిలలోని లోకోòÙడ్లలో ఈ పనులు ప్రారంభించారు. తొలుత గూడ్సు రైళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికే 42 లోకోమోటివ్‌లలో ఏర్పాటు చేశారు. ఇంజిన్‌ను పరిశీలించేందుకు వీలుగా ఉన్న కారిడార్‌లో చిన్న క్యాబిన్‌ ఏర్పాటుచేసి, అందులో యూరినల్స్‌ కమోడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. లోకోమోటివ్‌లలో నీటి వసతి ఉండదు కాబట్టి టాయిలెట్‌ కాకుండా యూరినల్స్‌ వసతి మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ కోచ్‌ నాలుగు రోజులకోసారి స్పెషల్‌ క్లీనింగ్‌కు షెడ్డుకు వెళ్తుంది. అప్పుడు అందులోని మానవ వ్యర్ధాలను తొలగిస్తారు. కానీ, లోకోమోటివ్‌ 90 రోజులకోసారి మాత్రమే షెడ్డుకు వెళ్తుంది. అప్పటి వరకు వ్యర్ధాలు నిల్వ ఉంచలేరు.  

ఎర్గోనామిక్‌ సీట్లు.. 
గతంలో 90 డిగ్రీల కోణంలో సీట్లు ఉండేవి. ఇవి ఏమాత్రం అనుకూలంగా ఉండేవి కాదు. వీటిల్లో ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తే నడుము, వెన్నెముఖ నొప్పులొస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మహిళా సిబ్బంది మరింత ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పుడు వీటి స్థానంలో ఎర్గోనామిక్‌ సీట్లను ఏర్పాటు చేస్తున్నారు.  

మంచినీళ్లు కూడా తాగేవాళ్లం కాదు
పురుషులతో సమానంగా ఈ కష్టతరమైన పనిచేయటాన్ని సవాల్‌గా తీసుకుని ఈ ఉద్యోగంలో చేరా. కానీ లోకోమోటివ్‌లలోని ప్రతికూల పరిస్థితులు ఈ సవాల్‌ను మరింత కఠినతరం చేశాయి. మంచినీళ్లు తాగితే మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందన్న భయంతో నీరు కూడా తాగకుండా పనిచేస్తూ వస్తున్నాం. రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం మాకు పెద్ద వరం లాంటిదే. - డి.దుర్గాభవాని, సీనియర్‌ అసిస్టెంట్‌ లోకోపైలట్‌

టాయిలెట్‌ వసతి కూడా  ఏర్పాటు చేయాలి 
దశాబ్దాల మా సమస్యలకు పరిష్కారంగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది. యూరినల్స్‌కే పరిమితం కాకుండా, టాయిలెట్‌ వసతి కూడా ఏర్పాటు చేస్తే సమస్యకు పూర్తి పరిష్కారం లభించినట్టవుతుంది.  - పి.రవీందర్, చీఫ్‌ లోకో ఇన్‌స్పెక్టర్‌

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)