Breaking News

ఫైర్‌ లేని వాల్స్‌!

Published on Sat, 03/15/2025 - 04:39

సాక్షి, హైదరాబాద్‌: ప్రతీ రంగంలో సాంకేతికత అత్యంత కీలకంగా మారింది. అదేస్థాయిలో సైబర్‌ దాడుల ముప్పు పొంచి ఉంటోంది. ఏదైనా సంస్థ నెట్‌వర్క్‌ను భద్రంగా ఉంచేందుకు పటిష్టమైన ఫైర్‌వాల్‌ రక్షణ వ్యవస్థ తప్పనిసరి. అయితే, హ్యాకర్ల దాడుల విషయంలో భారతీయ కంపెనీలకు చెందిన నెట్‌వర్క్‌లు బలహీనమని గ్రూప్‌–ఐబీ సంస్థ ఇటీవల విడుదల చేసిన హైటెక్‌ క్రైం ట్రెండ్స్‌ రిపోర్ట్‌–2025లో వెల్లడైంది. 

ప్రపంచవ్యాప్తంగా 2024లో జరిగిన సైబర్‌ దాడుల్లో అత్యధికంగా 13 శాతం ఘటనలు భారత్‌లోనే జరిగినట్టు ఆ నివేదిక స్పష్టంచేసింది. ప్రధానంగా విద్యాసంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్‌లపైనే హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. 

ఆ తర్వాత ప్రభుత్వరంగ సంస్థల నెట్‌వర్క్, మిలిటరీ, ఆర్థికసేవల సంస్థల నెట్‌వర్క్‌లు హ్యాకర్లకు లక్ష్యంగా మారుతున్నాయని పేర్కొంది. హ్యాకర్లు ఫైర్‌వాల్స్‌ను ఛేదించి సదరు నెట్‌వర్క్‌లోకి చొరబడి మొత్తం వ్యవస్థను తమ అ«దీనంలోకి తీసుకుని సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నట్టు తెలిపింది.  

డేటా లీకేజీలో అమెరికాది తొలిస్థానం
పబ్లిక్‌ డొమైన్‌లో ఉండే డేటా లీకేజీలో అమెరికా తొలిస్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది. 2024లో ఈ తరహా ఘటనలు అమెరికాలో 214 నమోదైనట్టు పేర్కొంది. తర్వాత స్థానంలో రష్యా (195 ఘటనలు) ఉండగా.. భారత్‌ (60) మూడో స్థానంలో నిలిచినట్టు గ్రూప్‌–ఐబీ నివేదిక పేర్కొంది. ఈ–మెయిల్‌ అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు, పాస్‌వర్డ్‌లు ఈ డేటా లీకేజీలో ఉంటు­న్నాయి. 2024లో ఈ–మెయిల్‌ అడ్రస్‌లు, పాస్‌వర్డ్‌లను డార్క్‌వెబ్‌లో విక్రయించడం ద్వారానే సైబర్‌ నేరగాళ్లు రూ.248.9 కోట్లు కొల్లగొట్టారు.

ఫైర్‌వాల్స్‌ అంటే? 
అనధికారికంగా నెట్‌వర్క్‌లోకి చొరబడకుండా, హానికరమైన డేటాను నెట్‌వర్క్‌లోకి చొప్పించకుండా రక్షించే భద్రతా పరికరమే ఫైర్‌వాల్‌. ఇది హార్డ్‌వేర్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ కావొచ్చు. నెట్‌వర్క్‌ ప్యాకెట్‌లను పరిశీలించి వాటిని అనుమతించాలా లేదా నిరోధించాలా అనేదాన్ని ఫైర్‌వాల్‌ నిర్ణయిస్తుంది. ఫైర్‌వాల్స్‌ ఇంటర్నెట్‌ ద్వారా కంప్యూటర్‌ లేదా నెట్‌వర్క్‌ను యాక్సెస్‌ చేయకుండా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను నిరోధించగలవు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)