Breaking News

లైవ్‌ లొకేషన్‌ తరహాలో తపాలా డిజిపిన్‌

Published on Mon, 06/23/2025 - 00:42

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ పిన్‌ (డిజిపిన్‌) వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో అనుసంధానించేందుకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తపాలాశాఖ ప్రతి 16 చదరపు మీటర్ల ప్రాంతానికి ప్రత్యేకంగా ఓ పిన్‌ నంబర్‌ను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఆ పిన్‌ నంబర్‌నే ఇప్పుడు రియల్‌టైమ్‌ లొకే షన్‌గా వాడుకునేలా తపాలాశాఖ గూగు ల్‌ మ్యాప్‌ ద్వారా అనుసంధానించింది. దీనిని వైద్యారోగ్య, పోలీసు, అగ్నిమాపక, రెవె న్యూ, మత్స్య తదితర శాఖలతో అనుసంధానిస్తారు. ఇది అత్యవసర సందర్భాల్లో ప్రజ లకు వీలైనంత తొందరలో సహాయం అందేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మేరకు ఆయా శాఖలతో అనుసంధానించాలంటూ తాజాగా తెలంగాణ తపాలాశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 

ఏంటీ వ్యవస్థ? 
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తపాలాశాఖ ఆధ్వర్యంలో పిన్‌కోడ్‌ నంబర్లు ఉన్న విష యం తెలిసిందే. ఓ గ్రామానికో, పట్ట ణాలు/నగరాల్లోని కొంతభాగానికో ఒకటి చొప్పున ఈ పిన్‌కోడ్‌ నంబర్లు ఉన్నాయి. అది చాలా పెద్ద పరిధితో కూడిన ప్రాంతానికి ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా చిన్నచిన్న ప్రాంతానికి ఒక ప్రత్యేక పిన్‌ నంబర్‌ ఉండేవిధంగా తపాలాశాఖ డిజిపిన్‌ వ్యవస్థను రూపొందించిన విషయం తెలి సిందే. ఐఐటీ హైదరాబాద్, నేషనల్‌ రిమో ట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీల సంయుక్తాధ్వర్యంలో దీనిని రూపొందించారు.

దేశంలో ప్రతి 4 చదరపు మీటర్లు ఇంటూ 4 చదరపు మీటర్ల ప్రాంతానికి ప్రత్యేక డిజిటల్‌ పోస్టల్‌ ఇండెక్స్‌ నంబర్‌ను కేటాయించారు. దాన్ని అక్షాంశ రేఖాంశాల ఆధారంగా స్థిరీకరించి శాటిలైట్‌ ద్వారా అనుసంధానించారు. ఇప్పుడు గూగుల్‌తో దాన్ని అనుసంధానించారు. మనం ఎక్కడున్నా ఆ ప్రాంత డిజిపిన్‌ను గుర్తించొచ్చు. స్మార్ట్‌ ఫోన్‌లో గూగుల్‌ ఓపెన్‌ చేసి ‘నో మై డిజిపిన్‌’అని టైప్‌ చేయగానే డిజిపిన్‌ యూఆర్‌ఎల్‌ ఓపెన్‌ అవుతుంది. దాన్ని క్లిక్‌ చేయగానే గూగుల్‌ మ్యాప్‌లో ఆ ప్రాంత డిజిపిన్‌ కనిపిస్తుంది. దాన్ని కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్‌ మ్యాప్‌లో మన లొకోషన్‌ ఎలా కనిపిస్తుందో, అలాగే మనం ఉన్న ప్రాంత డిజిపిన్‌ కూడా కనిపిస్తుంది.  

⇒ దేశం మొత్తాన్ని 16 గ్రిడ్లుగా విభజించారు. మళ్లీ పత్రి గ్రిడ్‌ను 16 చిన్న గ్రిడ్లుగా విభజించారు. అలా పది లేయర్లుగా విభజిస్తూ చివరు 16 చదరపు మీ టర్ల ప్రాంతం వరకు విభజించారు. ప్రతి గ్రిడ్‌కు ఓ నంబరు కేటాయిస్తూ.. చివరకు 16 చదరపు మీటర్ల ప్రాంతానికి పది డిజిట్లతో కూడిన ఫైనల్‌ నంబరు కేటాయించారు. అదే తుది డిజిపిన్‌ నంబరు.  

⇒ ఇది ఇంచుమించు ప్రతి ఇంటికి కాస్త అటూ ఇటుగా ఓ పిన్‌ నంబరుగా ఉంటుంది. పెద్ద అపార్ట్‌మెంట్లు, విశాలమైన ప్రాంగణం ఉన్న వాటికి నాలుగైదు నంబర్లు ఉంటాయి. వాటిల్లో ఏ నంబరును వినియోగించినా... మన కచ్చితమైన చిరునామాను గుర్తించొచ్చు.  
⇒ ఇక పార్శల్స్, ఉత్తరాలను పోస్ట్‌/కొరియర్‌ చేసేప్పుడు నగరం, పట్టణం, కాలనీ, వీధి, ఇంటినంబరు... ఇలాంటివి ఏవీ లేకుండా వ్యక్తి పేరు, డిజిపిన్‌ రాస్తే ఎలాంటి వెతుకులాట లేకుండా కచ్చితంగా ఆ చిరునామాను గుర్తించొచ్చు. 

⇒ చిరునామాలో వ్యక్తిగత గోప్యత ఉండాలనుకునేవారు వారి వ్యక్తిగత చిరునామా ఇవ్వకుండా కేవలం డిజిపిన్‌ ద్వారా ఆ పార్శిల్‌ను ఇంటికి తెప్పించుకోవచ్చు.  
⇒ మనం వేరే ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నామో.. అవతలి వారికి తెలిపేందుకు ఈ డిజిపిన్‌ను వాడుకోవచ్చు.  
⇒ భారీ వరదలు, అగ్ని, రోడ్డు ప్రమాదా లు, ఇతర ఉపద్రవాల్లో చిక్కుకున్నప్పుడు.. తాను ఉన్న ప్రాంతాన్ని అత్యవసర సేవలు అందించే వారికి ఈ డిజిపిన్‌ ద్వారా సులభంగా తెలపొచ్చు.  

⇒ ఈ–కామర్స్‌ కంపెనీలు, డిజిటల్‌ సర్వి సు ప్రొవైడర్లతో కూడా ఈ డిజిపిన్‌ వ్యవస్థను అనుసంధానించే కసరత్తు జరుగుతోంది. అప్పుడు క్యాబ్‌/ఆటో ప్రొవైడ ర్లు, ఆహార పదార్థాల సరఫరా సంస్థలు, కిరాణా, మందుల సరఫరా సంస్థలు కూడా వీటిని వినియోగించుకోవచ్చు.  
⇒ ఈ డిజిపిన్‌ ఏపీఐ, ఓపెన్‌ సోర్స్‌ రిపోజిటరీ జిట్‌హబ్‌లో అందుబాటులో ఉన్నా యని,  తమ పోర్టళ్లతో అనుసంధానించుకోవచ్చని తపాలాశాఖ పేర్కొంటోంది.   

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)