Breaking News

ఎర్త్‌ సైన్సెస్‌.. ఏంటి స్పెషల్‌?

Published on Wed, 12/03/2025 - 05:18

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం:  దేశంలోనే తొలిసారిగా ఎర్త్‌ సైన్సెస్‌ కోర్సులను ఒకేచోట అందించేలా కొత్తగూడెంలో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏమిటి దీని నేపథ్యం..ఇందులో ఉండే కోర్సులు ఏమిటి.. ఒకసారి చూద్దాం.. కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీని ఎర్త్‌ సైన్సెన్స్‌ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు మార్చి 27న సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. 

అనంతరం విశ్వవిద్యాలయానికి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీగా పేరు ఖరారు చేస్తూ జూన్‌ 5న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీకి వైస్‌ చాన్స్‌లర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి యోగితా రాణాను జూన్‌ 30న నియమించారు. ఈ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి జియాలజీ, ఎని్వరాన్‌మెంటల్‌ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ కోర్సులు ఉన్నాయి. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లోనూ ఈ కోర్సులు ఉన్నాయి. కాగా తొలి ఏడాది యూజీలో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, జియాలజీ కోర్సుల్లో విద్యార్థులు చేరారు. పీజీలో ఎని్వరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సులో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం వర్సిటీ ఇంజనీరింగ్‌ విభాగంలో మైనింగ్, కంప్యూటర్‌ సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఐటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  

దేశంలోనే తొలిసారిగా..: ఎర్త్‌ సైన్సెస్, ఎని్వరాన్‌మెంట్‌ విభాగాల్లో పలు కోర్సులను వేర్వేరు యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఒకచోట జియో ఫిజిక్స్‌ కోర్సు అందుబాటులో ఉంటే మరోచోట జియాలజీ వంటి కోర్సు అందుబాటులో ఉంది. అయితే భూమి, దాని స్వభావం, భూమిపై లభించే మూలకాలు, భూగర్భ జలాలు, భూమి పొరల్లో నిక్షిప్తమైన ఖనిజాలు తదితర అంశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులన్నింటినీ ఒకేచోట అందించే ప్రయత్నం డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ద్వారా జరుగుతోంది. ఎర్త్‌ సైన్సెస్‌కు సంబంధించి దేశంలోనే ఇది తొలి వర్సిటీ అని, ఈ తరహా మరో వర్సిటీ కేవలం అమెరికాలో ఉందని చెబుతున్నారు.

భవిష్యత్‌లో కీలకం.. 
గడిచిన మూడు దశాబ్దాలుగా ఐటీ రంగంలో విప్లవా త్మక మార్పులు వచ్చాయి. కానీ ఈ మార్పులు ఇక్కడితో ఆగిపోవడం లేదు. సెమీ కండక్టర్ల తయారీ విభాగంలో అంతర్జాతీయంగా తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఈ రంగంలో గుత్తాధిపత్యం సాధించిన చైనా ఏకంగా అమెరికాకే సవాల్‌ విసిరే స్థాయిలో ఉంది. అందుకే చైనాపై ఆర్థిక ఆంక్షలు విధించే విషయంలో అమెరికా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. రేర్‌ ఎర్త్‌ విషయంలో మన దేశం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది.

ప్రముఖ జాతీయ పరిశోధన సంస్థలతో సింగరేణి జట్టు కట్టింది. ఈ రంగం వైపు యువత ఎక్కువగా దృష్టి సారించేలా ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ దోహదం చేయనుంది. పెరుగుతున్న కాలుష్యం వల్ల ఢిల్లీ నగరం ప్రతీ ఏడాది శీతాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ తరహా సవాళ్లను ఎదుర్కొనే నూతన ఆవిష్కరణల్లో వర్సిటీ తనవంతు సాయం చేసే అవకాశముంది. ఇక భూగర్భ జలాలపై జరిగే ఫోకస్‌ పెరిగితే సాగు, తాగునీటి రంగంలో మరిన్ని మేలైన యాజమాన్య పద్ధతులు అందుబాటులోకి వచ్చే అవకాశముందని అంటున్నారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)