Breaking News

ప్రతి ఇద్దరిలో ఒకరు ఏఐ యూజర్‌

Published on Fri, 02/07/2025 - 04:38

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిన తర్వాత వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. క్షణాల్లోనే అనేక రకాల పనులు చేసిపెట్టే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఫ్లాట్‌ఫామ్‌ల వాడకం కూడా వేగం పెరుగుతోంది. భారతీయ ఇంటర్నెట్‌ యూజర్లలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక ఏఐ ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నట్టు ‘లోకల్‌ సర్కిల్స్‌’సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం కొత్తకొత్త ఏఐ ఫ్లాట్‌ఫామ్స్‌ వినియోగదారులకు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. 

చాట్‌జీపీటీ, గూగుల్‌ ఏఐ ప్లాట్‌ఫామ్‌ జెమిని, మెటాకు చెందిన లామా 3.. ఇలా అనేక రకాల ఏఐ ఫ్లాట్‌ఫామ్‌ల వాడకంపై గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 92 వేల మంది అభిప్రాయాలు సేకరించినట్టు లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ వెల్లడించింది. డీప్‌సీక్‌ ఏఐ ప్లాట్‌ఫామ్‌కు త్వరలో మారాలనుకుంటున్నట్టు సర్వేలో పాల్గొన్న 31 శాతం మంది తెలిపారు. 

అయితే ఏఐ ఫ్లాట్‌ఫామ్‌లు వాడి సేకరించిన సమాచారం తప్పుగా ఉందని 18 శాతం మంది చెప్పగా.. 28 శాతం మంది కచ్చితమైన సమాచారమని అంగీకరించారు. ఏఐ ప్లాట్‌ఫామ్‌లను వాడబోమని.. కానీ గూగుల్, ఇతర సెర్చ్‌ ఇంజిన్లను వాడతామని 40 శాతం మంది తెలిపారు. ఏమీ చెప్పలేమని 5 శాతం మంది అభిప్రాయపడ్డారు.

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)