Breaking News

హైవేపై పెరిగిన టోల్‌ఫీజు

Published on Sun, 03/31/2024 - 02:16

కేతేపల్లి: హైదరాబాద్‌–విజయవాడ 65 నంబరు జాతీయ రహదారిపై టోల్‌గేట్ల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేస్తున్న టోల్‌ ఫీజును రహదారి విస్తరణ కాంట్రాక్టు సంస్థ జీఎమ్మార్‌ యాజమా న్యం పెంచింది. ఒక్కో వాహనానికి ఒక వైపు, ఇరు వైపులా కలిపి రూ. 5నుంచి రూ. 40 వరకు, స్థాని కుల నెలవారీ పాస్‌ను రూ.330 నుంచి రూ.340 కి పెంచింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండల ఆంథోల్‌ మైసమ్మ దేవాలయం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు గల 181.5 కి.మీ మేర రెండులేన్లుగా ఉన్న రహదారిని దాదాపు రూ.2000 కోట్ల వ్యయంతో 2012లో బీవోటీ పద్ధతిన జీఎమ్మార్‌ సంస్థ నాలుగు లేన్లుగా విస్తరించింది.

ఈ విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు 65 నంబరు జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద ఒకొక్కటి చొప్పున మూడు టోల్‌ప్లాజాలను జీఎమ్మార్‌ సంస్థ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 2012 నుంచి టోల్‌ఫీజు వసూళ్లను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది.

ఎన్‌హెచ్‌ఏఐ సూచించిన నిబంధనల మేరకు వార్షిక సవరణల పేరిట ఏడాదికి ఒకమారు వాహనాల నుంచి వసూలు చేస్తున్న టోల్‌ఫీజు ధరలను పెంచుకునే వెసులుబాటు జీఎమ్మార్‌ సంస్థకు ఎన్‌హెచ్‌ఏఐ కల్పించింది.  ఆయా టోల్‌ప్లాజాల వద్ద ఈనెల 31(ఆదివారం) అర్ధరాత్రి 12 గంటల తర్వాత అంటే ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన టోల్‌ ధరలు అమల్లోకి రానున్నాయి.  ఏడాది కాలం పాటు ఇవే ధరలు అమల్లో ఉంటాయి. 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)